మనలో చాలామంది పండుగ సమయంలో కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీలాంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తే కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు. నవంబర్ 14వ తేదీన దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్ సైట్లు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
Also Read: మరో వివాదంలో తనిష్క్.. ఈసారి ఏం చేసిందంటే?
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు దాదాపు సగం ధరకే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించాయి. చాలా కాలం నుంచి వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తున్న వాళ్లకు వాటిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులే తక్కువ ధరకు లభ్యమవుతూ ఉండటంతో పాటు క్రెడిట్ కార్డులపై ఈ కామర్స్ సంస్థలు మరింత తక్కువకే కొనుగోలు చేసేలా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
లక్ష రూపాయల ఖరీదు చేసే హయర్ కంపెనీ సైడ్ బై సైడ్ ఫ్రిజ్ అమెజాన్ లో ప్రస్తుతం 52,000 రూపాయలకు అందుబాటులో ఉంది. అమెజాన్ బేసిక్స్ ఫ్రోస్ట్ ఫ్రీ ఫ్రిజ్ పై అమెజాన్ ఏకంగా 6,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్ ఫ్రిజ్ లపై కూడా కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో కూడా ఇదే విధంగా ఆఫర్లు అమలవుతున్నాయి. ఏసీలపై 20,000 రూపాయల వరకు, వాషింగ్ మెషీన్లపై 15,000 రూపాయల వరకు ఆఫర్లను అందిస్తున్నాయి.
Also Read: పేపర్ కప్పులలో టీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?
సాధారణంగా ఈ కామర్స్ సంస్థలు సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో పండగ సమయంలో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. పండగ సమయం తరువాత కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే సాధారణ రేట్లకే ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.