ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.26,600 వేతనంతో..?

ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. 120 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://www.oilindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 120 ఉద్యోగ ఖాళీలలో జనరల్ అభ్యర్థులకు […]

Written By: Navya, Updated On : July 27, 2021 11:41 am
Follow us on


ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. 120 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://www.oilindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం 120 ఉద్యోగ ఖాళీలలో జనరల్ అభ్యర్థులకు 54 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఓబీసీలకు 32, ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 12, ఎస్టీలకు 14, ఎస్సీలకు 8 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఇంటర్ కనీసం 40 శాతం మార్కులతో పాసై డిప్లొమా (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ను పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

వరుసగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 26,600 రూపాయల వేతనం లభించనుంది.