ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. రూ.90వేల జీతంతో..?

దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలలో ఒకటైన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 120 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆగష్టు 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By: Navya, Updated On : July 5, 2021 3:09 pm
Follow us on

దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలలో ఒకటైన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 120 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆగష్టు 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారు అసోంలోని డిబ్రూగఢ్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. https://www.oil-india.com/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 120 ఉద్యోగ ఖాళీలలో జనరల్ ఉద్యోగ ఖాళీలు 54, ఓబీసీ 32, ఈడబ్ల్యూఎస్‌ ఉద్యోగ ఖాళీలు 12, ఎస్సీ ఉద్యోగ ఖాళీలు 8, ఎస్టీ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి. 40 శాతం మార్కులతో ఇంటర్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఎమ్మెస్ వర్డ్ తో పాటు ఎమ్మెస్‌ ఎక్సెల్‌, ఎమ్మెస్‌ పవర్‌పాయింట్‌ కచ్చితంగా వచ్చి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. https://www.oil-india.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.