పరీక్ష లేకుండా ఆయిల్ ఇండియాలో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థలలో ఒకటైన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 119 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఆయిల్ ఇండియా నుంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆయిల్ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా 119 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. […]

Written By: Navya, Updated On : May 7, 2021 10:56 am
Follow us on

దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థలలో ఒకటైన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 119 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఆయిల్ ఇండియా నుంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆయిల్ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా 119 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

అర్హత, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.oil-india.com/ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 119 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ మెకానిక్ విభాగంలో 79, గ్యాస్ లాగర్ విభాగంలో 20, ఇతర విభాగాల్లో మిగిలిన ఖాళీలు ఉన్నాయి.

వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా విద్యార్హతలు ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు ఉద్యోగాలకు వయో పరిమితి వేర్వేరుగా ఉండటం గమనార్హం. కెమికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల వయస్సును కలిగి ఉండాలి. మిగిలిన ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 22లోగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.oil-india.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే నెల 24వ తేదీ నుంచి జూన్ నెల 22వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుంది.