
పార్లమెంట్ లో విపక్షాల నినాదాలతో హోరెత్తిస్తున్నారు. లోక్ సభ, రాజ్యసభలో ఇవాళ ఉదయం భారీ స్థాయిలో విపక్షాలు నిరసన నివాదాలు వినిపించాయి. రాజ్యసభలో విపక్ష సభ్యులు వెల్ లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. పెగాసస్ ప్రాజెక్టు నివేదికపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ చట్టాలు చేసేందుకు ఉందని, కానీ సభ్య కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నట్లు వెంకయ్య అన్నారు. పార్లమెంట్ దిగజారిన తీరు దురదృష్టకరమని ఆయన అన్నారు. అయినా విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో సభను వాయిదా వేశారు.