https://oktelugu.com/

బీరెడీ: ఆర్ఆర్ఆర్ నుంచి 1వ తేదీన ఈ సర్ ప్రైజ్

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కోసం జక్కన్న రంగం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ‘పాటలు’ మినహా అన్ని పూర్తి అవ్వడంతో ఇప్పుడు చిత్రం యూనిట్ ప్రమోషన్ వేటలో పడింది. మొదటి ప్రమోషన్ బాధ్యతలను చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. ఇందుకు గాను ‘ఆర్ఆర్ఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2021 / 11:40 AM IST
    Follow us on

    దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కోసం జక్కన్న రంగం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ‘పాటలు’ మినహా అన్ని పూర్తి అవ్వడంతో ఇప్పుడు చిత్రం యూనిట్ ప్రమోషన్ వేటలో పడింది. మొదటి ప్రమోషన్ బాధ్యతలను చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేపట్టారు.

    ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. ఇందుకు గాను ‘ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్’ పేరిట ప్రత్యేక గీతాన్నిరూపొందించారు. అయితే ఇందులోని పాటను ఎవరు పాడుతున్నారానే దానిపై ఆసక్తి అందరిలోనూనెలకొంది.

    తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఈ విషయాన్ని రివీల్ చేసింది. పాడే వారు, సంగీత దర్శకులతో ఓ ఫొటోను పంచుకుంది. ఈ పాటను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఆ భాషలకు చెందిన ప్రముఖ గాయకులే పాడనున్నారు. ఒక్కో భాషలో ఒక్కో సింగర్ తో ఈ పాటను పాడించారు.

    ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘స్నేహం విలువ తెలిపేలా’ దోస్త్ అనే పాటను రూపొందించారు. తెలుగులో దీన్ని హేమచంద్ర పాటనున్నాడు. ఇక తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ చేత పాడించనున్నారు. ఇక మలయాళంలో విజయ్ ఏసుదాసు, హిందీలో అమిత్ త్రివేది, కన్నడలో యాజిన్ నైజర్ దీన్ని ఆలపించారు.

    ఈ పాటను ఆగస్టు 1న అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. రాంచరణ్-ఎన్టీఆర్ స్నేహం విలువను చాటిచెప్పే పాట అని చెబుతున్నారు.

    https://twitter.com/RRRMovie/status/1419892817879470081?s=20