https://oktelugu.com/

ప్రముఖ సంస్థలో భారీవేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవలప్‌మెంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 4, 2021 / 02:10 PM IST
    Follow us on

    రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవలప్‌మెంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

    మొత్తం 6 ఉద్యోగ ఖాళీలలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీ ఒకటి కాగా జూనియర్‌ అసిస్టెంట్‌ 2 ఉద్యోగ ఖాళీలు, సెక్షన్‌ ఆఫీసర్‌ ఒక ఉద్యోగ ఖాళీ, లైబ్రరీ అసిస్టెంట్‌ ఒక ఉద్యోగ ఖాళీ, లైబ్రరీ అటెండెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ ఒక ఉద్యోగ ఖాళీ ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని భావించే వాళ్లు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఆర్‌జీఎన్‌ఐవైడీ, శ్రీపెరుంబుదూర్, కంచిపురం, తమిళనాడు–602105 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.

    రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.