దేశంలో చాలా సంస్థలు ఉద్యోగులతో సాధారణంగా 8 గంటలు పని చేయించుకోవాల్సి ఉండగా ఎక్కువ సమయం పని చేయించుకుంటున్నాయి. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వగా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పనిభారం పెరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఓవర్ టైమ్ చేస్తే కొన్ని కంపెనీలు వేతనం ఇస్తున్నా మరికొన్ని కంపెనీలు మాత్రం అదనపు పనిగంటలకు వేతనం చెల్లించడం లేదు.
Also Read: ఈ హెడ్ ఫోన్స్ ధర రూ.80 లక్షలు.. ఎందుకంత ఖరీదంటే..?
అయితే కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలలో చేసిన్న మార్పుల ప్రకారం పనివేళలకు సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇకపై ఉద్యోగులు రోజులో ఎనిమిది గంటలు వారంలో 48 గంటలకు మించి పని చేస్తే కంపెనీలు డబుల్ జీతం చెల్లించాలి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ ను సిద్ధం చేసిందని సమాచారం.
Also Read: శరీరంలో వేడి తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
త్వరలోనే కేంద్రకార్మిక శాఖ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం 15 – 30 నిమిషాల మధ్య పనిచేస్తే అరగంటగా, అరగంట నుంచి గంట మద్య పని చేస్తే గంటగా పరిగణించి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అధిక పని సమయానికి రెట్టింపు జీతం అంటే కంపెనీలు సైతం ఉద్యోగులతో ఓవర్ టైమ్ చేయించుకోవడానికి ఇష్టపడవు.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రతిపాదనకు చట్టబద్ధత తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే చిన్న కంపెనీలలో పని చేసే ఉద్యోగులు పనిభారం పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తే ఉద్యోగులు వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది