నవంబర్ లోనే ఇండియాలోకి కొత్త స్ట్రెయిన్

ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే, ప్రస్తుతం యూకే లో కరోనా మహమ్మారి రూపం మార్చుకొని కొత్త స్ట్రెయిన్ గా మార్పులు చెందింది. ఇది పాత వైరస్ కంటే 70శాతం వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలోకి కూడా ఈ వైరస్ వ్యాపించింది. ఇప్పటికే ఇండియాలో 20 కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోకి ఈ వైరస్ డిసెంబర్ […]

Written By: Suresh, Updated On : December 31, 2020 8:15 am
Follow us on

ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే, ప్రస్తుతం యూకే లో కరోనా మహమ్మారి రూపం మార్చుకొని కొత్త స్ట్రెయిన్ గా మార్పులు చెందింది. ఇది పాత వైరస్ కంటే 70శాతం వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలోకి కూడా ఈ వైరస్ వ్యాపించింది. ఇప్పటికే ఇండియాలో 20 కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోకి ఈ వైరస్ డిసెంబర్ కి ముందే వచ్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. యూకేలో సెప్టెంబర్ లోనే ఈ వైరస్ మార్పులు చెందుతూ వచ్చిందని, ఇండియాలో నవంబర్ చివరిలో లేదంటే డిసెంబర్ మొదటివారంలో వ్యాపించి ఉండొచ్చని అన్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.