NHM AP Recruitment 2021: ఏపీ ప్రభుత్వ విభాగంలో 70 ఉద్యోగ ఖాళీలు.. రూ.లక్ష వేతనంతో?

NHM AP Recruitment 2021: నేషనల్‌ హెల్త్ మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 70 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 13 జిల్లాలోని 14 టెలీ మెడిసిన్‌ హబ్స్‌లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-మెయిల్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://hmfw.ap.gov.in/ వెబ్ సైట్ […]

Written By: Navya, Updated On : August 28, 2021 10:25 am
Follow us on

NHM AP Recruitment 2021: నేషనల్‌ హెల్త్ మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 70 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 13 జిల్లాలోని 14 టెలీ మెడిసిన్‌ హబ్స్‌లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-మెయిల్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

https://hmfw.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలలో 14 పీడియాట్రీషియన్‌ ఉద్యోగ ఖాళీలు, 14 గైనకాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలు, 14 జనరల్ ఫిజీషియన్ ఉద్యోగ ఖాళీలు, 28 మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయలు, ఇతర ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 53,300 రూపాయలు చెల్లిస్తారు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. spmuaprect@gmail.com ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.