Sai Pallavi: పది పదిహేను ఏళ్ల క్రితం హీరోయిన్లు అంటే.. చాలా అందంగా ఉండాలి, చక్కని రూపం ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది సినిమా జనాల్లో. అందుకే సినిమా రంగానికి విలువలు తక్కువ అనే భావన ఉండేది జనాల్లో. ఒకవేళ సినిమా హీరోయిన్ అవ్వాలి అంటే .. ముంబై నుంచి ఊడి పడాలి కానీ.. తెలుగు అమ్మాయి చేయడం ఏమిటి అనే విమర్శలు చేసేవారు.
కానీ రోజులు మారాయి. ఇప్పుడు ఆ భావన తగ్గింది. హీరోయిన్లు కూడా మన ఇంట్లో ఉండే సాధారణ అమ్మాయిలే అని, వారికీ విలువలు ఉంటాయని జనాలు నమ్ముతున్నారు. కారణం ‘సాయి పల్లవి’ (Sai Pallavi) లాంటి హీరోయిన్లే. అసలు మొహం నిండా మొటిమలు, పెద్ద పొడగరి కాదు, మాట, గొంతు మధురంగా ఉండదు, ఇక ఎక్స్ పోజింగ్ చేయదు, పైగా తెలుగు భాష కూడా రాదు.
ఒకప్పుడు ఇలాంటి హీరోయిన్ ను తీసుకోడానికి మన దర్శకులు కచ్చితంగా జంకేవారు. అసలు ఇలాంటి అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. శేఖర్ కమ్ముల ఆమెను ఏ కళ్ళతో చూశాడో గాని, సాయి పల్లవి అనే అమ్మాయి సామాన్యురాలు, మన పక్కింటి అమ్మాయి లాంటిదే అన్న భావన కలిగించాడు.
కానీ, సాయి పల్లవి కష్టం గురించి ఎవరికి తెలియదు. ఈ రోజు ఆమె హీరోయిన్ గా సక్సెస్ అయింది అంటే.. దాని వెనుక సంవత్సరాల కష్టనష్టాలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. మరెన్నో బాధలు ఉన్నాయి. సాయి పల్లవి గతంలో చాలా ఏళ్ళ కిందట తెలుగు షోస్ లో పాల్గొని తన ప్రతిభను చూపింది. పైగా కెరీర్ మొదట్లో ఏవో ఒకటి అరా చిన్నచితకా పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది.
నేడు సౌత్ ఇండియన్ దర్శకుల కళ్ళలో పడింది. ఒకసారి సాయి పల్లవితో మీరు ఎక్స్ పోజింగ్ చేస్తారా అంటే.. ‘కోటి రూపాయలు ఇచ్చినా చేయను. ఇంకో 20 ఏళ్ళ తరువాత కూడా నా సినిమాలు నా పిల్లలు చూసి.. అమ్మ బాగా చేసింది అనుకోవాలి. కానీ వారు తల దించుకోకూడదు’ అని కచ్చితంగా చెప్పింది. ఏది ఏమైనా సాయి పల్లవి తెలుగు సినిమా హీరోయిన్ల గత స్థితిని మార్చింది. ఈ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.