https://oktelugu.com/

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కంపెనీలకు హెచ్చరిక..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత కేంద్రం అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు మేలు జరిగేలా కార్మిక చట్టాలలో కీలక మార్పులు చేస్తోంది. కేంద్రం ఇప్పటికే కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే కేంద్రం అమలులోకి తీసుకురాబోతున్న చట్టాలను కొన్ని కంపెనీలు స్వంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయి. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 21, 2020 / 06:41 PM IST
    Follow us on


    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత కేంద్రం అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు మేలు జరిగేలా కార్మిక చట్టాలలో కీలక మార్పులు చేస్తోంది. కేంద్రం ఇప్పటికే కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే కేంద్రం అమలులోకి తీసుకురాబోతున్న చట్టాలను కొన్ని కంపెనీలు స్వంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయి.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?

    పలు కంపెనీలు పర్మనెంట్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా లాభాలను పెంచుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో మోదీ సర్కార్ పర్మనెంట్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కంపెనీలు ఉద్యోగుల విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచనలు చేసింది.

    Also Read: నిరుద్యోగులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్ న్యూస్.. రూ.40 వేల వేతనంతో ఉద్యోగాలు..?

    కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. కంపెనీలు సీఎస్ఆర్ ఫండ్ ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చవచ్చని.. సీఎస్ఆర్ ఫండ్ ను ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడానికి కూడా కేంద్రంఉపయోగించవచ్చని కేంద్రం తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలులోకి రానున్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    కొత్త కార్మిక చట్టాల అమలు ద్వారా ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న ప్రయోజనాలతో పోలిస్తే అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలకు సంబంధించిన సమావేశాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.