Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. పది అర్హతతో?

Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. పది అర్హతతో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 80 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సివిలియన్ పోస్టులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల […]

Written By: Navya, Updated On : February 11, 2022 11:37 am
Follow us on

Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. పది అర్హతతో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 80 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సివిలియన్ పోస్టులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

Indian Coast Guard Jobs

18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు అని చెప్పవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ చెన్నై అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

Also Read: రోజాకు ఈసారైనా మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా? ప్ర‌త్య‌ర్థుల ఉచ్చులో చిక్కుకుంటారా?

2022 సంవత్సరం జనవరి 23వ తేదీన ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 22వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 80 ఉద్యోగ ఖాళీలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హతకు తగిన విధంగా ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: జగన్ ఇది నీకు తగునా? ప్రజలకు మూడు గంటల నరకం భావ్యమా?