https://oktelugu.com/

Surya And Sukumar: సూర్య, సుకుమార్ కాంబోలో రావాల్సిన ఆ సూపర్ హిట్ సినిమా మిస్ అవ్వడానికి కారణం ఏంటి..?

మొత్తానికైతే పుష్ప సినిమా అల్లు అర్జున్ తో చేయడం వల్ల ఆయన పాన్ ఇండియాలో గుర్తింపు సంపాదించుకోవడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరి కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద కూడా పలురకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక పుష్ప కంటే భారీ ఎత్తున సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 18, 2024 / 09:37 AM IST

    Surya And Sukumar

    Follow us on

    Surya And Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం సుకుమార్ తనతైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా తన మార్క్ అనేది చూపిస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు కి వినిపించాడట…

    అయితే ఈ సినిమాకి మహేష్ బాబు నో చెప్పడంతో ఈ స్క్రిప్ట్ ను తీసుకొని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. లక్కీ గా అల్లు అర్జున్ ఓకే అన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మాత్రం ఈ సినిమాని తమిళ్ స్టార్ హీరో అయిన సూర్యతో చేయాలని అనుకున్నాడట. సూర్య కూడా సుకుమార్ తో ఇంతకు ముందే ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉందని తన ఫేవరెట్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరని చెప్పాడు. పుష్ప ప్రాజెక్టులో అల్లు అర్జున్ లేకపోతే మాత్రం పుష్ప సినిమాను సూర్య తో చేసేవాడు. దాంతో ఆ సినిమా క్రేజ్ మొత్తం సూర్య కి వెళ్లిపోయేది. ఇక మొత్తానికైతే సూర్య ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. అలాగే సుకుమార్ కూడా మొదట మన తెలుగు హీరోలకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. వాళ్లు ఓకే చెప్పకపోతే తమిళ హీరో దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు.

    ఇక మొత్తానికైతే పుష్ప సినిమా అల్లు అర్జున్ తో చేయడం వల్ల ఆయన పాన్ ఇండియాలో గుర్తింపు సంపాదించుకోవడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరి కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద కూడా పలురకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక పుష్ప కంటే భారీ ఎత్తున సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో కూడా సుకుమార్ కనిపించబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఆగస్టు 15వ తేదీన థియేటర్ లోకి రావాల్సిన పుష్ప 2 సినిమా డిసెంబర్ కి వెళ్ళిపోయింది. మరి పుష్ప 2 సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఇప్పటికైతే ఈ సినిమా మీద ఇండియలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలైతే భారీ స్థాయి లో ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి సూపర్ సక్సెస్ గా నిలుపుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ గాని, సాంగ్స్ గాని ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇక అందులో భాగంగా ఈ సినిమా నుంచి తొందర్లోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… బన్నీ కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అంటూ అటు ఆయన అభిమానులు కూడా మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు…ఇక మొత్తానికైతే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమాగా రావడం విశేషం…