ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆఫీస్ లో నిద్రపోతే జాబ్ పోయినట్లే..?

దేశంలోని కార్యాలయాల్లో పని చేసే కొందరు ఉద్యోగులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నిద్రపోయిన ఘటనల గురించి గతంలో మనం వినే ఉంటాం. ఇలా ఆఫీస్ లో పనివేళల్లో నిద్రపోయే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను రూపొందించి నెల రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తోంది. Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..? ఉద్యోగులు చేసిన పనులు దుష్ప్రవర్తన కిందికి […]

Written By: Kusuma Aggunna, Updated On : January 5, 2021 5:15 pm
Follow us on


దేశంలోని కార్యాలయాల్లో పని చేసే కొందరు ఉద్యోగులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నిద్రపోయిన ఘటనల గురించి గతంలో మనం వినే ఉంటాం. ఇలా ఆఫీస్ లో పనివేళల్లో నిద్రపోయే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను రూపొందించి నెల రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తోంది.

Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..?

ఉద్యోగులు చేసిన పనులు దుష్ప్రవర్తన కిందికి వస్తే యజమాని ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. కేంద్రం నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రవర్తన సరిగ్గా లేకపోయినా యజమాని సస్పెండ్ చేయవచ్చు. సేవా రంగం, తయారీ రంగాలకు ఉద్యోగుల దుష్ప్రవర్తనకు సంబంధించిన నియమనిబంధనలు ఒకే విధంగా ఉండటం గమనార్హం. రీయింబర్స్ మెంట్ కొరకు తప్పుడు బిల్లులు ఇచ్చినా, యజమాని ఇచ్చే భద్రతా పరికరాలను తిరస్కరించినా, ధరించకపోయినా దుష్ప్రవర్తన కిందికి వస్తుంది.

Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

సంస్థకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చెప్పినా, లిఖితపూర్వకంగా ఇచ్చిన నోటీసులు, ఉత్తర్వులకు ఉద్యోగి స్పందించకపోయినా, రెండు వారాల ముందు నోటీసులు ఇవ్వకుండా కార్మికులు సమ్మెకు దిగినా, తగిన కారణం, అనుమతులు లేకుండా విధుల నుంచి వెళ్లిపోయినా, హింసకు పురిగొల్పేలా ఉపన్యాసాలు ఇచ్చినా, సహోద్యోగి, పై అధికారులను బెదిరించినా యజమాని సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

విధి నిర్వహణలో నిద్రపోయినా, లేని వ్యాధి ఉందని చెప్పినా, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా పేరు, వయస్సు, అనుభవం గురించి ఉద్యోగి తప్పుడు సమాచారం ఇచ్చినా, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడినా, యజమాని ఆస్తికి నష్టం కలిగించినా, పని చేసే సమయం మద్యం తాగటం, గొడవ పడటం చేసినా, తరచూ విధులకు ఆలస్యంగా వచ్చినా, లంచాలు ఇచ్చినా లేదా తీసుకున్నా, ఉద్దేశపూర్వకంగా ఉద్యోగి ఎదురు తిరిగినా, విధినిర్వహణలో అవినీతికి పాల్పడినా, దొంగతనం, మోసం చేసినా సస్పెండ్ కావడంతో పాటు ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉంటాయి.