Google Gemini JEE Main Mock Tests: ఐఐటీల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం విద్యార్థులు వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటుంటారు. దీనికోసం కాలేజీలు కూడా ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఏఐ జనరేషన్‌లో విద్యారంగంలోనూ విప్లవాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగా జేఈఈలోకి కూడా తీసుకువచ్చింది Google Gemini.
మాక్ టెస్టులు..
ఎప్పటికీ జేఈఈ మెయిన్ విద్యార్థులు ఫిజికల్ ప్రాక్టీస్ పేపర్లు, కోచింగ్ మాక్ టెస్టులపైనే ఆధారపడేవారు. ఇది సమయం, డబ్బు, ప్రయాణాలతో పడిపోయేది. ఇప్పుడు Google Gemini ఉచిత ఫుల్–లెంగ్త్ మాక్ టెస్టులతో ఈ పరిస్థితిని పూర్తిగా రీడిఫైన్ చేస్తోంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈమేరకు ప్రకటన చేశారు. ఇది ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. పూర్తిగా ఉచితం కూడా.
విద్యార్థులకు ప్రయోజనాలు
ఇంటి నుంచే ఫుల్ మాక్ టెస్టులు రాయొచ్చు, కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. డబ్బు ఖర్చు లేకుండా అనంతంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు గొప్ప అవకాశం. స్కోర్ విశ్లేషణ, బలాలు–బలహీనతలు చూపిస్తూ పర్సనలైజ్డ్ సలహాలు ఇస్తుంది. ఈ ఫీచర్ జేఈఈ మెయిన్ ప్యాటర్న్‌కు సరిగ్గా మ్యాచ్ అవుతూ, రియల్ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఎలా ఉపయోగించాలి..
– Gemini యాప్ డౌన్‌లోడ్ చేసి, జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్ సెర్చ్ చేయండి.
– వీక్లీ 2–3 టెస్టులు రాసి, పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయండి.
– బలహీన అంశాలపై ఫోకస్ చేసి, స్కోర్ మెరుగుపరచండి.
– ఈ టూల్‌తో జేఈఈ మెయిన్ క్రాక్ చేయడం మరింత సులభమవుతుంది.
ఈ మార్పు వేలాది మంది విద్యార్థులకు సమాన అవకాశాలు సృష్టిస్తుంది. కోచింగ్ లేని చోట్ల డ్రాప్‌ఔట్ రేట్లు తగ్గుతాయి, పోటీస్థాయి పెరుగుతుంది. అయితే, ఏఐ టెస్టులు మానవ మూల్యాంకనంలా కచ్చితంగా ఉంటాయా? ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఇది పరిమితి కావచ్చు. భవిష్యత్తులో ఇండియన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ డిజిటల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.