SSB Recruitment 2021: దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎస్సై ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 116 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అక్టోబర్ నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. http://www.ssbrectt.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

సబ్ ఇన్‌స్పెక్టర్(స్టాఫ్ నర్సు/ఫిమేల్), సబ్ ఇన్‌స్పెక్టర్ (డ్రాఫ్ట్స్‌మెన్), సబ్ ఇన్‌స్పెక్టర్(పయనీర్), సబ్ ఇన్‌స్పెక్టర్(కమ్యూనికేషన్) ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఆస్పత్రి నుంచి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో ఇందుకోసం రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా తక్కువ సమయంలోనే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35,000 రూపాయల నుంచి 1,12400 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెపవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.