Hyderabad DCCB Recruitment 2022: హైదరాబాద్‌ డీసీసీబీలో స్టాఫ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

Hyderabad DCCB Recruitment 2022: డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మొత్తం 52 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ మేనేజర్‌ […]

Written By: Navya, Updated On : February 20, 2022 6:09 pm
Follow us on

Hyderabad DCCB Recruitment 2022: డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మొత్తం 52 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలు 7 ఉండగా స్టాఫ్‌ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 45 ఉన్నాయి.

Hyderabad DCCB Recruitment 2022

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 17,900 రూపాయల నుంచి 57,860 రూపాయల వరకు వేతనం లభించనుంది. తెలుగు భాషలో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: షర్మిల సాక్ష్యమే కీలకమా?

రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దశలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సం బంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్ అభ్యర్థులకు 900 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు 250 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.

2022 సంవత్సరం మార్చి 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఏప్రిల్‌ 23 లేదా 24 తేదీలలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. http://www.hyderabaddccb.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై దుమారం? మంగ‌ళ్ హాట్ పీఎస్ లో ఎఫ్ ఐఆర్ న‌మోదు