Army Recruitment Rally: భారీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఈ జిల్లాల వారు అర్హులు పూర్తి వివరాలు ఇవే!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పచ్చ జెండా ఊపింది గుంటూరులోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం. 13 జిల్లాల అభ్యర్థుల కోసం కడపలో నిర్వహించేందుకు నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : October 19, 2024 12:37 pm

Army Recruitment Rally

Follow us on

Army Recruitment Rally: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది.ఈ మేరకు గుంటూరులోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది.కడపలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆర్మీ ఓపెన్ ర్యాలీకి సిద్ధమయింది. అయితే ఈ ర్యాలీలో ఏయే జిల్లాల వారు పాల్గొనవచ్చు, అర్హతలు, రిక్రూట్మెంట్ జరిగే తేదీలు, ఇతర వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ఆర్మీ కార్యాలయం. కడపలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15 వరకు ఈ ర్యాలీ జరగనుంది. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్ని వీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్ని వీర్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు ఎంపిక జరగనుంది. ట్రేడ్స్ మాన్ పోస్టుకు ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత చాలు. మిగతా ఉద్యోగాల కు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షలో అర్హత, మెరిట్ సాధించిన వారికి ఉద్యోగాలు లభించునున్నాయి.

*ఈ జిల్లాల వారు హాజరు కావచ్చు
ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరు కావచ్చు. ఆర్మీ కార్యాలయ వెబ్సైట్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదలైంది. ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డులు పంపుతున్నారు. అడ్మిట్ కార్డులు వచ్చిన వారు ర్యాలీకి హాజరు కావాల్సి ఉంటుంది.

* ప్రత్యేక ఏర్పాట్లు
కడప జిల్లా యంత్రాంగంతో కలిసి ఆర్మీ అధికారులు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి. కేవలం మూడు వారాల వ్యవధి ఉండడంతో క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 13 జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు రానుండడంతో.. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.