https://oktelugu.com/

Chandrababu: అమరావతి విషయంలో గొప్ప ముందడుగు వేసిన చంద్రబాబు

గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అమరావతిని ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో ఈరోజు కీలక నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 19, 2024 / 12:40 PM IST

    CM Chandrababu

    Follow us on

    Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది ఈరోజు. రాజధానిలో కీలక నిర్మాణాల పున ప్రారంభ పనులు ఈరోజు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు ఆ పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కూటమికి అనుకూల ఫలితాలు వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు కిరువైపులా ముళ్ళ కంపలు, పిచ్చి మొక్కలను తొలగించారు. విద్యుత్ దీపాలను వెలిగించారు. జూన్ 12న సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అమరావతి కొత్త కళతో కనిపించింది. ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అమరావతికి అనుకూలంగా నిర్ణయాలు ప్రారంభమయ్యాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులను స్థానానికి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. గత ఐదు సంవత్సరాలుగా అమరావతి నిర్మాణ పనులను అలానే విడిచిపెట్టడంతో.. చాలా రకాల నిర్మాణాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఐఐటి నిపుణులు వచ్చారు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ఇంకోవైపు నిధుల సమీకరణ సైతం ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక విజ్ఞప్తితో కేంద్రం స్పందించింది. బడ్జెట్లో 15 వేల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధులనుంచి సర్దుబాటు చేసింది. అయితే ఇంకో వైపు రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేసేందుకు 36 కోట్ల రూపాయలతో కంపెనీ టెండర్ తగ్గించుకుంది. గత కొద్దిరోజులుగా వందలాది యంత్రాలతో పనులు చేపట్టింది. అవి తుది దశకు చేరుకున్నాయి. అమరావతి నిర్మాణ పనులు యధాస్థితిలోకి రానున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

    * సీఆర్డీఏ సొంత భవనం
    అమరావతి రాజధాని నిర్మాణ పనులను సిఆర్డిఏ పర్యవేక్షిస్తోంది. గతంలో సిఆర్డిఏ భవన నిర్మాణాలకు గాను అప్పటి టిడిపి ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంతో అమరావతిని నిర్వీర్యం చేసింది వైసీపీ సర్కార్. ఎక్కడి వక్కడే పనులు నిలిచిపోయాయి. దీంతో అమరావతి రాజధాని అనేది ఒక అడవిలా మారిపోయింది. ఒకవైపు నిధుల సమీకరణ, మరోవైపు వెళ్లిపోయిన సంస్థలను తిరిగి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు.. ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈరోజు సీఎం చంద్రబాబు కీలక నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం.

    * వీలైనంత త్వరగా పనులు
    అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షించేది సిఆర్డిఏ. ముందుగా ఆ కార్యాలయ భవనం పూర్తయితే.. మిగతా వాటిపై పర్యవేక్షించేందుకు వీలవుతుంది. సిఆర్డిఏ లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకే ముందస్తుగా సిఆర్డిఏ భవన నిర్మాణానికి సంబంధించి పెండింగ్ పనులను ప్రారంభించారు చంద్రబాబు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో సిఆర్డిఏ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.