Homeఎడ్యుకేషన్Half Day Schools: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి హాఫ్‌డే..

Half Day Schools: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి హాఫ్‌డే..

Half Day Schools: ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చనిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వేడి పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి మొదటి వారంలోనే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది.

విద్యాశాఖ ఉత్తర్వులు..
మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పని వేళలు మార్పు..
ఇక పాఠశాలల పనివేళలను కూడా మార్చింది. ఈమేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలను నిర్వహించాలని తెలిపింది. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని సూచించింది.

యథావిధిగా ప్రత్యేక తరగతులు..
పాఠశాలలను ఒంటిపూట నిర్వహించినా పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపింది. ఇప్పటికే సిలబస్‌ పూర్తయి రివిజన్‌ జరుగుతున్నందున పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించింది. మార్చి 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పదో తరగతి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటిపూట బడి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version