HomeతెలంగాణKCR: కేసీఆర్‌లో తీవ్ర నైరాశ్యం.. ఆ వ్యాఖ్యలతో క్యాడర్‌ డీలా..

KCR: కేసీఆర్‌లో తీవ్ర నైరాశ్యం.. ఆ వ్యాఖ్యలతో క్యాడర్‌ డీలా..

KCR: తెలంగాణలో రాజకీయా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. తమకు తిరుగులేదని భావించిన గులాబీ నేతలకు షాక్‌ ఇచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా డీలా పడ్డారు. అయితే ఓటమిని సమీక్షించుకోకుండా.. అధికార కాంగ్రెస్‌ తప్పుడు హామీలే తమ ఓటమికి కారణమని తమ ఓటమికి కూడా కాంగ్రెస్‌నే బీఆర్‌ఎస్‌ బాధ్యుల్ని చేస్తోంది. అదే పార్టీ శ్రేణులకు రుచించడం లేదు.

కేసీఆర్‌ గాయంతో..
ఎన్నికల ఓడిపోయిన వారం పది రోజుల్లోనే కేసీఆర్‌ తన ఫాం హౌస్‌లో జారిపడ్డాడు. తుంటి ఎముక విరిగింది. దీంతో మూడు నెలలు బయటకు రాలేదు. దీంతో క్యాడర్‌లో మరింత నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడిప్పుడే కేసీఆర్‌ బయటకు వస్తున్నారు. కానీ ఆయన కారును పార్లమెంటు ఎన్నికల రేసులో నిలిపే అవకాశం కనిపించడం లేదు.

పక్క చూపులు చూస్తున్న నేతలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో కూడా పుంజుకునే పరిస్థితి బీఆర్‌ఎస్‌లో కనిపించడం లేదు. దీంతో కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు సిట్టింగ్‌ ఎంపీలు ఇప్పటికే చాలా మంది పార్టీ మారారు. ఎమ్మెల్యేలు పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత జంప్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే వారిని ఆపే ప్రయత్నం గులాబీ నేతలు కనీసం చేయడం లేదు. ఇది కూడా క్యాడర్‌లో నిరుత్సాహానికి కారణమవుతోంది.

కేసీఆర్‌ వ్యాఖ్యలతో..
ఇక ఇటీవల కేసీఆర్‌ పార్టీ ముఖ్య నేతలతో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నలుగురు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు చెప్పిన మాటలు బూమరాంగ్‌ అయినట్లు కనిపిస్తోంది. ‘ఎన్టీఆర్‌ అంతటి నేతకే తప్పలేదు మనమెంత’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అంటే కేసీఆర్‌ పూర్తిగా చేతులు ఎత్తేశారా అన్న అనుమానం క్యాడర్‌లోకి వెళ్లింది. కానీ కేసీఆర్‌ ఉద్దేశం తాత్కాలికమే అని, కానీ అది క్యాడర్‌కు కరెక్టుగా కన్వే కాలేదు..

గురువును చూసి నేర్చుకుంటాడా..
చంద్రశేఖర్‌రావు గురువు చంద్రబాబు నాయకుడు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాడు. ఎన్ని ఆట్లు ఎదురైనా పడిలేనిన కెరటంలా ఓడినా.. మళ్లీ గెలుస్తున్నాడు. ఓడినప్పుడు కుంగిపోవడం లేదు. కసిగా పనిచేస్తున్నారు. క్యాడర్‌ చేజారకుండా చూసుకుంటున్నారు. వైఎస్సార్‌ హయాంలో రెండుసార్లు ఓడిపోయారు. తర్వాత 2014 పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2019లో జగన్‌ చేతిలో ఓడిపోయారు. 2024లో మళ్లీ అధికారమే లక్ష్యంగా కసిగా పనిచేస్తున్నారు. 74 ఏళ్ల వయసులో జగన్‌ జైల్లో పెట్టినా కుంగిపోలేదు. కానీ, కేసీఆర్‌ ఒక్క ఓటమికే పూర్తిగా కుంగిపోయినట్లు కనిపిస్తున్నారు. అదే ఆ పార్టీకి మైనస్‌గా మారుతోంది.

ఇప్పటికైనా కేసీఆర్‌ వేదాంతం మాటలు వీడి.. చంద్రబాబు తరహాలో పడిలేచిన కెరటంగా పార్టీని కాపాడుకుని, వచ్చే ఎన్నిల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలని పొలిటికల్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. అలాకాకుండా నైరాశ్యంలో ఉంటే.. పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version