AP Temperature : ఎండలు మండిపోతున్నాయి. వేసవి( summer ) ప్రారంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పాఠశాలల్లో పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే నిర్వహించే దిశగా ఏపీ విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట సెలవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఆనవాయితీకి బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. ఎండలు దృష్ట్యా.. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచి వస్తున్న విన్నపాలు మేరకు ముందుగానే.. ఒంటిపూట సెలవులు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
* ఫిబ్రవరి మొదటి వారం నుంచి..
ఈ ఏడాది ఫిబ్రవరి( February) మొదటి వారం నుంచే ఎండలు మండుతూ వచ్చాయి. ఉదయం దాటితే బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. తెలంగాణతో పోల్చితే ఏపీలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా జిల్లాల్లో అప్పుడే 35 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతోంది. కర్నూలు లాంటి జిల్లాలో అయితే ఏకంగా 38 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. శివరాత్రి దాటడం.. మార్చి రావడంతో పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : ‘భరత్ అనే నేను’.. మహేష్ లా.. సీఎం జగన్ సాధించాడు..
* కసరత్తు ప్రారంభం
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఏపీ విద్యాశాఖ( AP education department) ఉంటిపూటబడులపై కసరత్తు చేసే పనిలో పడింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. గత ఏడాది మార్చి 18 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రత మార్చిలో మరింత పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళనతో ఉన్నారు. వీలైతే మార్చి మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించే అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
* 17 నుంచి 10వ తరగతి పరీక్షలు
సాధారణంగా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఒంటి పూట బడులు( half day schools) నిర్వహిస్తారు. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఎండలు దృష్ట్యా పాఠశాలల వద్ద తాగునీరుతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 31 వరకు పరీక్షలు కొనసాగుతాయి. మరోవైపు ఏపీ విద్యా సంవత్సరం ఏప్రిల్ 24 తో ముగియనుంది.
Also Read : టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. అప్రమత్తమైన అధికారులు..