Marriage: శోభనం పాల ప్రత్యేకత తెలుసా.. అందులో ఏం కలుపుతారంటే..

పెళ్లి ఇద్దరిని ఒకటి చేస్తుంది. ప్రత్యేక బంధం ఏర్పరుస్తుంది. శోభనం ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి శోభనం చాలా అవసరం

Written By: Raj Shekar, Updated On : March 7, 2024 4:43 pm

Marriage

Follow us on

Marriage: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఉందో.. శోభనానికీ అంతే ప్రాధాన్యత ఉంటుంది. గతంలో పెళ్లితోపాటు శోభనానికి ముహూర్తాలు నిర్ణయించేవారు. అయితే ఇప్పుడు పెళ్లికి ముందే జంటలు కలిసిపోతున్నాయి. శోభనం అనేది ఒక ప్రత్యేమైన వేడుక. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే కార్యం. అందుకే హనీమూన్‌ కూడా ప్లాన్‌ చేసుకుంటారు. అయితే శోభనం రోజు భార్య భర్తకు పాలు తీసుకురావడం చూస్తుంటాం. అలా ఎందుకు తెస్తుంది. ఆ పాల ప్రత్యేత ఏంటి. అందులో ఏం కలుపుతారు అనే వివరాలు తెలుసుకుందాం.

– పెళ్లి ఇద్దరిని ఒకటి చేస్తుంది. ప్రత్యేక బంధం ఏర్పరుస్తుంది. శోభనం ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి శోభనం చాలా అవసరం

– స్త్రీ పురుషుల కలయిక సృష్టి ధర్మం. ఈ ధర్మాన్ని నెరవేర్చడానికి శోభనం తప్పనిసరి. అందుకే శోభనానికి ప్రత్యేకత ఉంటుంది. శోభనం గదిని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు.

– శోభనం అనగానే అందరికీ పాల గ్లాసుతో అమ్మాయి గదిలోకి రావడం గుర్తుకు వస్తుంది. అయితే అవి సాదాసీదా పాలు కాదు. ఎన్నో పోషకాలు కలిగిన ఎనర్జీ డ్రింక్‌.

– ఈ పాలలో పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, బాదం పప్పు చూర్ణం కలుపుతారు. ఆ పాలు తాగితే కాముడు మేల్కొంటాడు. ఆలుమగల మధ్య బిడియాన్ని దూరం చేస్తాడు.

మానసికంగా శారీరకంగా దగ్గర అయ్యేది శోభనం రోజు మాత్రమే. గతంలో శోభనం మూడు రోజులు చేసేవారట. పెరిగిన బిజీలైఫ్‌తో ఇప్పుడు ఆ కార్యం కూడా మమ అనిపిస్తున్నారు. పెళ్లి అంటేనే పదహారు రోజుల పండుగలా జరిగేవి. ఇప్పుడు మూడు రోజులు జరిగితే మహా గొప్ప. అయితే తక్కువ సమయంలో ఎక్కువ గ్రాండ్‌గా చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని కార్యాలను హడావుడిగా కానిచ్చేస్తున్నారు.