School Bus Drivers: ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది పై ఉపోద్ఘాతం మొత్తం శ్రీ చైతన్య విద్యాసంస్థలదని. ఇటీవల నీట్ ర్యాంకులు విడుదలైనప్పుడు.. ఆల్ ఇండియా టాపర్ తమ విద్యార్థి అని శ్రీ చైతన్య ప్రకటించిన ఫలితాలలో వెల్లడించింది. అంతేకాదు వార్తాపత్రికలలో భారీగా ప్రకటనలు ఇచ్చింది. నారాయణ విద్యా సంస్థ కూడా అదే విద్యార్థిని తమవాడిగా చెప్పుకుంది. ఆల్ ఇండియా టాపర్ అని పేర్కొంది. మరి ఆ విద్యార్థి ఏ విద్యాసంస్థలో చదివినట్టు? ఎక్కడ ర్యాంకు సాధించినట్టు? ఇక మధ్య తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారి శ్రీ చైతన్య విద్యాసంస్థలను సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. క్రితం రోజు పప్పును విద్యార్థులకు వడ్డించడాన్ని గమనించారు. ఆ పప్పును ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తే భరించలేకుండా ఉంది. వెంటనే ఆమె సంబంధిత కిచెన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శ్రీ చైతన్య విద్యార్థుల ఆత్మహత్యలకైతే లెక్కేలేదు. ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ఘోరాలు చోటు చేసుకున్నప్పటికీ తల్లిదండ్రులు మారడం లేదు.. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తన తీరు మార్చుకోవడం లేదు.
Also Read: ఇకపై టెస్ట్ మ్యాచ్ నాలుగు రోజులే.. భారత్ – ఇంగ్లాండ్ సిరీస్ ను ఎలా నిర్వహిస్తారంటే?
మద్యపానం అనేది హానికరం. మద్యం తాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం. ఈ విషయాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల బస్సులు తోలే డ్రైవర్లు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే వారు మద్యం తాగి విద్యార్థులు ప్రయాణించే బస్సులు నడుపుతున్నారు. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు.. మేము కావాలని రాస్తున్న వార్త అంతకన్నా కాదు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాదులో అధికారులు బస్సుల తనిఖీ చేపట్టారు. అధికారులు శ్రీ చైతన్య బస్సును పరిశీలిస్తే.. దానిని నడుపుతున్న డ్రైవర్ కు మద్యం నిర్ధారణ పరీక్ష నిర్వహించారు.. అతడికి ఏకంగా 202 రీడింగ్ రావడం విశేషం. అలాగే ప్రిజం స్కూల్ బస్సును కూడా తనిఖీ చేస్తే.. ఆ డ్రైవర్ కి కూడా భారీగానే రీడింగ్ రావడం గమనార్హం. దీంతో పోలీసులు ఆ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు. సాధారణంగానే హైదరాబాదులో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలాంటి చోట ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడపాల్సి ఉంటుంది. ముఖ్యంగా బడి పిల్లలను తీసుకెళ్తున్న బస్సు అత్యంత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని డ్రైవర్లు అడ్డగోలుగా మద్యం తాగి.. బస్సు నడుపుతున్నారు. ఇలాంటివారిని నమ్ముకుని.. లక్షలకు లక్షలు ఫీజు కట్టి.. పాఠశాలలలో చేర్పిస్తే వారి భవితవ్యం ఎలా ఉంటుంది? వారికి భద్రత ఎలా లభిస్తుంది? ర్యాంకులని, అన్ని సీట్లు మావేనని గొప్పగా చెప్పుకునే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోదా? లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ చేతులు దులుపుకుంటుందా? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: 30కి.మీలు వెళ్ళడానికి 6 గంటల సమయం.. జగన్ వెంట జనసునామీ