Today June 19 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గజకేసరి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండన్నాయి. మరి కొన్ని రాశుల వారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read: నాడు అవమానాలు చీత్కారాలు.. నేడు సన్మానాలు.. అవార్డులు..స్ఫూర్తినిచ్చే ట్రాన్స్ జెండర్ మంజమ్మ కథ
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అనుకూలమైన సమయం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కృషిస్తారు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎదుటివారి తో సంయమనం పాటించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . కొన్ని పెండింగ్ పనులను చాలా చక్కగా పూర్తి చేస్తారు. మాటలను నైపుణ్యం ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చుట్టూ ఎంతోమంది అభిమానులు ఉన్నా కొందరితో జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిని తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్తగా పనులు ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడతారు. ప్రియమైన వారికోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందే ఓ సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వారితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులు తమ తెలివితేటల ద్వారా కార్యాలయాల్లో రాణిస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఒక పెద్ద బాధ్యతను చేపట్టడంతో పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరికీ లొంగకుండా ఉండాలి. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలను పకడ్బందీగా ఉండాలి. కొత్త వ్యక్తుల మాటలను నమ్మకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అధికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే సొంత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బలహీనతల గురించి ఎదుటివారికి చెప్పకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే కొన్ని విషయాల్లో చాలా ఓపిక అవసరం. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించడం ద్వారా సంతోషంగా ఉండగలుగుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అరుదైన అవకాశాలు లభిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తొందర పడొద్దు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అయితే తోటి వారితో సమయమనం పాటించాలి. వారితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ప్రియమైన వారి కోసం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొన్ని పనులు ఆగిపోవడంతో విశ్రాంతిని తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రియమైన వారి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని విషయాల్లో వారి సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు. చెడు విషయాలకు దూరంగా ఉంటేనే మంచిది. అనవసరపు వివాదాల్లోకి దూరకుండా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు నైపుణ్యం కారణంగా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే ఎవరిని తేలికగా తీసుకోకుండా సొంత విషయాలను ఇతరులుగా పంచుకోవద్దు. వ్యాపారులకు కొందరు కొత్త వ్యక్తులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని విషయాల్లో వారితో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు సమయాన్ని వృధా చేసుకోకుండా చేపట్టిన పనులను పూర్తి చేయాలి. కొన్ని పనుల్లో నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాస్తవాలు తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి ముందడుగు వేయాలి. ఎన్ని అడ్డంకులు ఏదైనా చేపట్టిన పనులు పూర్తి చేయడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తారు.