ICC Four-Day Test Proposal: సుదీర్ఘ ఫార్మాట్ ఐదు రోజులకు పరిమితమైంది. ఈ ఐదు రోజుల్లోనే విజేత నిర్ణయం సాగేది. అయితే అన్ని సందర్భాల్లో ఈ మ్యాచ్లో విజేతను నిర్ణయించే పరిస్థితి ఉండేది కాదు. సుదీర్ఘ ఫార్మాట్లో డ్రా దిశగానే చాలా వరకు మ్యాచులు సాగేవి. ఇక వన్డే ఫార్మాట్ కూడా 50 ఓవర్ల వరకు పరిమితమైంది. ఇక 2007 నుంచి t20 పేరుతోపొట్టి ఫార్మాట్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తోంది. అన్ని దేశాలలో క్రికెట్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి. లీగ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ లీగ్ పోటీలలో క్రికెటర్లు పాల్గొంటూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. అయితే క్రికెట్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: ICC President Jay Shah: జై షా చైర్మన్ గా ఉన్నా.. ఐసీసీ ముందు బీసీసీఐ కి పరపతి లేకుండా పోయిందా?
సుదీర్ఘ ఫార్మాట్ ను నాలుగు రోజులకు కుదించాలని భావించినట్టు తెలుస్తోంది. అయితే 2027 నుంచి 2029 వరకు ప్రపంచ సుదీర్ఘ సమరంలో భాగంగా .. చిన్న దేశాల మధ్య సుదీర్ఘ ఫార్మాట్ ను నాలుగు రోజులపాటు నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే భారత్, ఇంగ్లీష్, కంగారు జట్లు ఐదు రోజులు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇటీవల డబ్ల్యూటీసీ తుది పోరు జరిగినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జై షా ఎదుట ఈ ప్రతిపాదన రాగా.. ఆయన దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
ఎందుకోసమంటే..
చిన్న జట్లు ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం రావాలి, ఖర్చు కూడా తగ్గాలి అనే ఉద్దేశంతోనే నాలుగు రోజులపాటు టెస్ట్ మ్యాచ్లు నిర్వహించే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది.. ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్లో చిన్న జట్లు ఎక్కువ రోజులు ఆడలేక పోతున్నాయి. అందువల్లే వాటి మధ్య టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ నిర్వహించి.. వాటిని నాలుగు రోజులపాటు మాత్రమే ఆడించేందుకు ఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శుక్రవారం నుంచి భారత్ ఇంగ్లీష్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ మొదలు కాబోతోంది. ఈ సిరీస్లో ప్రతి మ్యాచ్ కూడా 5 రోజుల పాటు సాగుతుంది.
Also Read: ICC: వన్డేలలో సమూల మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయం..
ఐసీసీ తీసుకొచ్చిన నాలుగు రోజులు నిబంధన ఈ సిరీస్ కు వర్తించదని తెలుస్తోంది. అయితే ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ లలో నాలుగు రోజులపాటు మ్యాచ్ నిర్వహించడానికి 2017 లోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఐదు రోజులపాటు మ్యాచ్ నిర్వహించాలంటే చిన్న జట్లుకు ఇబ్బందిగా ఉంది. ఖర్చు కూడా విపరీతంగా ఉండడం వల్ల.. ఆయా జట్లు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త విధానంలో అయితే వేగంగా సిరీస్ పూర్తికావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత డబ్ల్యూటీసి సీజన్ లో మాత్రం ఐదు రోజులపాటు మ్యాచులు జరుగుతాయని ఐసిసి పెద్దలు ప్రకటించారు.