https://oktelugu.com/

పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వారికి మాత్రమే..?

గత కొన్ని రోజుల నుంచి దేశంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫైర్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా అందులో 20 సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఒక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం ఉంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 10:19 AM IST
    Follow us on


    గత కొన్ని రోజుల నుంచి దేశంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫైర్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా అందులో 20 సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఒక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం ఉంది.

    Also Read: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే..?

    https://bankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నవంబర్ 1వ తేదీ 2020 నాటికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఐదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష పేపర్ల సంఖ్య కుదింపు..?

    నాగ్ పూర్ లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజీ నుంచి ఫైర్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సైతం అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా డిసెంబర్‌ 21, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు వేతనాల చెల్లింపులు ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు రాత పరీక్ష లేకపోవడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది.