
జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా… ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వారుగా గుర్తించారు.