Delhi: బాల్యం దారి తప్పుతోంది.. భావి భారతం తప్పటడుగు వేస్తోంది. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో తెలిసీ తెలియని వయసులోనే తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే సరైన మార్గమని భావిస్తోంది. ఇప్పటికే మనిషుల్లో మానవత్వం మాయమైపోతోంది. ఒకప్పుడు సొంతవారికన్నా.. ఎదుటి వారికి సాయం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపేవారు. నాటి రోజుల్లో టీవీలు, సెల్ఫోన్లు లేవు. ఒకటి కష్టసుఖాలు మరొకరు తెలుసుకునేవారు. అన్నీ పంచుకునేవారు. టీవీ వచ్చాక.. మాట్లాడుకోవడం కాస్త తగ్గింది. సామాజిక దూరం పెరగడం ప్రారంభమైంది. ఇక సెల్‌ఫోన్ వచ్చింది. ఇది అన్నింటినీ దూరం చేస్తోంది. సమాజంతో, ఇరుగుపొరుగువారినే కాదు.. ఒకే ఇంట్లో భార్య, భర్తల మధ్య, ఒకే ఇంట్లో పిల్లలు, పేరెంట్స్ మధ్య దూరం పెంచింది. మన చేతికి ఉన్న వాచ్‌ను దూరం చేసింది. పిల్లలను పుస్తకాలకు దూరం చేసింది. బంధుత్వం, బంధాలను తినేసింది. చివరకు కలిసి సినిమా చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక ఇదే సెల్‌ఫోన్ మనిషిలోని మానవత్వాని మొత్తం తినేసింది. క్రూరత్వాని, లైంగిక వాంఛను పెంచి పోషిస్తోంది. క్రిమినల్స్‌గా మారుస్తోంది. తెలియని విషయాలను తెలుపుతుంది కదా అనుకుంటే.. మంచి విషయాలకన్నా చెడు విషయాలనే ఎక్కువగా చెబుతుంది. దీంతో మనుసుల మధ్య బంధాలు దూరమవుతున్నాయి. చిన్న పిల్లలను సైతం నేరస్థులుగా మారుస్తోంది. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ చిన్నపిల్లల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. సెలవు కోసం మదరసాలో ఐదేళ్ల చిన్నారనిని తోటి విద్యార్థులు చంపేశారు. నిందితుల 9 నుంచి 11 ఏళ్లలోపే వారే. ఇక ఓ పదేళ్ల విద్యార్థి ఏకంగా గన్ తీసుకుని స్కూల్‌కు వెళ్లాడు. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గన్‌తో బడికి..
గన్ కల్చర్ అమెరికాలో ఎక్కువ. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు గన్స్ తెచ్చి టీచర్లను బెదిరించడం, తోటి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పలు జరుపడం తరచూ జరుగుతుంటాయి. ఇపుపడు ఆ కల్చర్ ఇండియాలోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఢిల్లీలోని ఓ పాఠశాలలో పదేళ్ల పిల్లాడు స్కూల్‌కు తుపాకి తీసుకురావడంతో తోటి విద్యార్థులు హడలిపోయారు. ఉపాధ్యాయులకు విషయం చెప్పగా వారు స్టూడెంట్ నుంచి తుపాకిని తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కుటుంబసభ్యులను విచారించగా అది చిన్నారి తండ్రికి చెందినదని, అతడు కొన్ని నెలలక్రితం మరణించాడని పేర్కొన్నారు. తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు లైసెన్సును రద్దు చేసేలా చర్యలు చేపడుతున్నారు.
వరుస ఘటనలు..
ఇటీవల విద్యార్థులు పాఠశాలలకు తుపాకులను తీసుకువస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది మేలో ఉత్తరప్రదేశ్ లో ఓ పదేళ్ల చిన్నారి ఇంట్లో దొరికిన పిస్టల్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన 16 ఏళ్ల సోదరిని కాల్చి చంపాడు. అదే నెలలో లఖ్‌నవూలో 12వ తరగతి చదువుతున్న ఓ బాలుడు గదికి తలుపు వేసుకొని తుపాకితో కాల్చుకుని చనిపోతానని బెదిరించాడు. పోలీసులు విశ్వప్రయత్నాలు చేసి, అతడిని రక్షించారు. తనకు చదువుపై ఆసక్తి లేకపోయినా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుండటంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లుగా తెలిపాడు. జూలైలో బిహార్‌లో ఐదేళ్ల చిన్నారి పాఠశాలకు తుపాకీ తీసుకువచ్చాడు. దానితో ఆడుకుంటూ 10 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు.
సెవలు కోసం హత్య..
ఢిల్లీలోని దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో విద్యార్థులు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. హత్య చేసిన వారి వయసు కేవలం 9 నుంచి 11 ఏళ్లు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 5 ఏళ్ల చిన్నారి రుహాన్ అపస్మారక స్థితిలో ఉన్నట్టు మదర్సా డైరెక్టర్ గమనించారు. పిల్లాడి తల్లికి ఫోన్ చేసి చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్‌ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ చిన్నారిని పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. రుహాన్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. ఇందులో చిన్నారి హత్యకు గురైనట్లు తెలిసింది. మదర్సా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్‌తో అసభ్యంగా ప్రవర్తించి హత్య చేశారు. విద్యార్ధి చనిపోతే మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని అంతమొందించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Unexpected incident in school student who went to school with a gun
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com