Salt : అతి సర్వత్ర వర్జయేత్. ఏ విషయంలో అయినా సరే అతి చేయకూడదు అంటారు పెద్దలు. అతిగా తినడం, అతిగా మాట్లాడటం, అతిగా నిద్ర పోవడం వంటి అతి పనులు అన్ని కూడా అనర్థాలు తీసుకొని వస్తాయి. అందుకే అతి చేయకూడదు అంటారు. మరి తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కారం, ఉప్పు, మాసాల వంటివి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అందులో ఉప్పును అసలు ఎక్కువగా తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మరి మీరు కూడా ఇలా తినే వారు అయితే ఇకనుంచి కచ్చితంగా తక్కువ చేసుకోవాలి. లేదంటే చాలా సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇంతకీ ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఓ సారి చూసేద్దామా?
ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని చాలా మందికి తెలిసిన విషయమే. దీని వల్ల హై బీపీ, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు బాధ పెడుతుంటాయి. కాబట్టి, ఉప్పుని తక్కువగా తీసుకోవాలి. ఉప్పు లేకుండా కూరలు రుచి ఉండవు. అందుకే ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు కొందరు. మంచిది కాదని తెలిసినా సరే ఉప్పు వాడకం తక్కువ చేయరు. అందుకే ఉప్పు వల్ల కలిగే సమస్యలు ఏంటో ఓ సారి తెలుసుకుంటే మీ ఆలోచన మారవచ్చు.
ఉప్పు శరీరానికి అవసరమైనప్పటికీ, అతిగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో తెలుసుకొని మీ లైఫ్ లో ఈ ఉప్పును ఇక నుంచి తక్కువ చేసుకోండి. అధిక రక్తపోటు కు కారణం అవుతుంది ఈ ఉప్పు. అధిక సోడియం నీరు నిలుపుదలని పెంచుతుంది. రక్తపోటును పెంచుతుంది. గుండెను ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకే ఉప్పును జర తక్కువ చేయండి.
హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాలక్రమేణా, అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ధమనులు దెబ్బతింటాయి. గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కిడ్నీ డామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల సోడియంతో మూత్రపిండాలను ఓవర్‌లోడ్ అవుతాయి. దీంతో మూత్రపిండాల పనితీరును దెబ్బతింటుంది. నీటి నిలుపుదల ఎక్కువ అవుతుంది. అధిక ఉప్పు ఉబ్బరం, వాపుకు కారణమవుతుంది. దీంతో మీరు ఉబ్బినట్లు లేదా బరువుగా ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు. కంఫర్ట్ గా ఉండరు.
ఎముకలు బలహీనపడటం కూడా జరుగుతుంది. అధిక సోడియం స్థాయిలు కాల్షియంను క్షీణింపజేస్తాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది ఉప్పు. కడుపు సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అధిక ఉప్పు కడుపు అల్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. డీహైడ్రేషన్ వంటి సమస్యలను కూడా పెంచుతుంది ఈ ఉప్పు. ఎక్కువ ఉప్పు ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దాహం, నిర్జలీకరణం, అలసటకు దారితీస్తుంది. స్ట్రోక్ ప్రమాదం వచ్చేలా కూడా చేస్తుంది ఈ ఉప్పు. సోడియం-ప్రేరిత హైపర్‌టెన్షన్ స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.