Capital Move From Delhi: దేశ రాజధాని అంటే ఎలా ఉండాలి.. పచ్చటి ప్రదేశాలు, ఎత్తయిన నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆహ్లాదమైన ప్రదేశాలు.. ఇలా కానీ మన భారతదేశ రాజధాని మాత్రం దీనికి భిన్నం. ఇక్కడ అంతా కాలుష్యమే.. ప్రాణవాయువు సైతం కలుషితమే. ఇక్కడి కాలుష్యం రాను రాను ఢిల్లీ వాసుల ఆయుష్షు తగ్గించుకుంటూ వెళ్తోంది. చలికాలం వచ్చిందంటే చాలు ఎయిర్ క్వాలిటీ ఇండక్స్ లో గాలి నాణ్యత పడిపోతూనే ఉంటుంది. దిన దిన శ్వాస పీల్చుకోవాలన్నా ఇబ్బంది తప్పదు. ప్రక్షాళనకు చాలా మార్గాలు అన్వేషించారు. ఒకసారి సరి సంఖ్య, బేసి సంఖ్యలో వాహనాలకు అనుమతిచ్చారు. అయినా ఎయిర్ పొల్యూషన్ లో మాత్రం పెద్దగా మార్పు లేదు. రాజధానే ఇలా ఎలా అన్న ప్రశ్నలు తరుచూ ప్రజా ప్రతినిధులు, నేతలకు కలుగుతోంది. అయితే ఇదేదో నెలల సమస్య కాదు పదేళ్లకు పైగా ఇదే సమస్య. ఒక సిగరేట్ పీల్చే సాధారణ వ్యక్తి ఊపిరితిత్తులు ఎలా ఇన్ ఫెక్షన్ కు గురవుతాయో ఢిల్లీలో ఉంటూ సిగరేట్ అలవాటు లేని వారి లంగ్స్ కూడా అలాగే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. చలికాలంలో ఢిల్లీలో పరిస్థితి మరింత దిగజారుతుంది. గాలిలో నాణ్యత 420పైగా పడిపోతుంది. మనిషికి మనిషి కనపడనంత దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది.
మరి ఒక్క ఢిల్లీకే ఎందుకంత దుస్థితి అంటే శాస్త్రవేత్తలు చెప్తున్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఢిల్లీ కాలుష్యాన్ని ఆకర్షించేదిగా ఉంటుందట. దేశంలో వివిధ ప్రాంతాల్లో కలుష్యం మెల్లగా ఢిల్లీకి చేరుతుందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ పరిస్థితులు చూస్తే అలానే కనిపిస్తున్నాయి. కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా రాజధానిని ఢిల్లీ నుంచి మార్చాలని కోరారు.
బడులకు సెలువులు, ప్రజా రవాణా నిలిపివేతలు నిరంతరం కొనసాగుతున్నాయంటే ఇక ఢిల్లీ రాజధానిగా ఏ మాత్రం సేఫ్ కాదని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అంటున్నారు. వీరి వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిని మార్చడం ఎలా అవుతుందో కొంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మన ఢిల్లీ లాగానే ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్ లో సమస్య ఉండేది. కానీ బిలియన్ల కొద్దీ ఖర్చు, ఏడేళ్ల కఠిన శ్రమతో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. కానీ మన దేశంలో అది మరింత కష్టంతో కూడుకుంది. దేశ రాజధానిని మార్చాలంటే చాలా ఇబ్బందితో కూడుకుంది. ఎందుకంటే ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ప్రభుత్వ కార్యాలయాలు, చట్ట సభలు ఏర్పాటు చేయాలి అది అంత సులువు కానేకాదు. గుజరాత్ లో అహ్మదాబాద్ అత్యంత కాలుష్య కూపంలో ఉండడంతో గాంధీ నగర్ ను నిర్మించారు. అంటే అది ఒక రాష్ట్రానికి సంబంధించి కాబట్టి నడుస్తుంది. కానీ ఇది దేశానికి సంబంధించి కాబట్టి మరింత శ్రమించాల్సి వస్తుంది.
ఇండోనేషియా లాంటి చిన్న దేశం తన రాజధానిని జకార్త నుంచి బోర్నియోకు మార్చుకుంది. దీనికి సుమారు 40 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు వచ్చింది. ఇక అదే మన దేశమైతే వందలు, వేలు దాటి పోతుంది. ఎందుకంటే పార్లమెంట్ భవనాల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులు ఇలా చాలా నిర్మించాలి. ఇదంతా అయ్యే పని కాదు. చాలా వరకు ఖర్చు అవుతుంది. ఇక అంత కన్నా మరింత కఠిన నిబంధనలు తీసుకువచ్చి ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గిస్తే ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Can the capital delhi be changed due to pollution what will happen if it is changed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com