Delhi Pollution: ఆ మధ్య కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు శశిధరూర్ దేశ రాజధానిగా ఢిల్లీ ఉండడం ఎందుకు అని ప్రశ్నించారు. అసలు రాజధానిగా ఢిల్లీ నగరాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడ గాలి అత్యంత విషపూరితంగా మారిందని.. కనీసం ఉండే అవకాశం కూడా లేకుండా పోయిందని.. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరమని.. ఢిల్లీలో గాలి పిలిచితే అంతకు రెట్టింపు హాని శరీరానికి కలుగుతుందని శశిధరూర్ పేర్కొన్నారు. శశి చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పు పట్టారు. అయితే మెజారిటీ ప్రజలు ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. ఢిల్లీ నగరం దేశ రాజధానిగా ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఎందుకంటే ఢిల్లీ నగరంలో ప్రస్తుతం కాలుష్యం తార స్థాయికి చేరింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానులలో ముందు వరుసలో ఉంది. గత కొద్దిరోజులుగా అక్కడ వాతావరణం దారుణంగా ఉండడంతో.. కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తోంది. చివరికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కూడా కురిపించడం ప్రారంభించింది. అయినప్పటికీ అక్కడ కాలుష్యం స్థాయి తగ్గడం లేదు. పైగా కాలుష్య స్థాయి అంతకంతకు పెరుగుతోంది. గాలిలో నాణ్యత పూర్తిగా తగ్గిపోవడంతో శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య ఎక్కువ అవుతున్నది. అత్యవసరమైన పని ఉంటేనే బయటికి రావాలని వాతావరణ శాఖ చెబుతూ ఉండడం ఢిల్లీలో పరిస్థితిని తేట తెల్లం చేస్తోంది. శశిధరూర్, ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. సమాజంలో లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కాలుష్యం నివారణ దిశగా ప్రభావంతమైన అడుగులు పడటం లేదు.
మీ ఊపిరితిత్తులను పరీక్షించుకోండి
ఢిల్లీలో కాలుష్యం అనేది నవంబర్ నుంచి జనవరి వరకు సర్వసాధారణంగా మారింది. పొరుగున ఉన్న రాష్ట్రాలలో రైతులు తన పంట పొలాల్లో వ్యర్ధాలను తగలబెట్టడం ద్వారా విపరీతమైన పొగ ఢిల్లీ నగరాన్ని కమేస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అక్కడ వాతావరణం లో విపరీతమైన మంచు కురుస్తోంది. అందువల్ల అక్కడ గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతున్నది. ఇదే విషయంపై అశోక విశ్వవిద్యాలయం డీన్, ప్రముఖ పరిశోధకుడు అనురాగ్ ఆందోళన వ్యక్తం చేశారు..” ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా ఉంది. ఇలాంటి కాలుష్యం వల్ల ధూమపానం చేసే వాళ్ళు మాత్రమే కాదు.. ఆ అలవాటు లేని వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. వారి ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమై ఉంటాయి. ఇక శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు నరకం చూస్తున్నారు. ఢిల్లీ కాలుష్యం ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చెప్పడం కష్టంగాని.. అనుభవించే వారు మాత్రం నరకం చూస్తారు. అక్కడిదాకా పరిస్థితి రాకముందే మేలుకోవాలి. సాధ్యమైనంతవరకు ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలని” అనురాగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కాలుష్యంపై అనురాగ్ చేసిన వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: People living in delhi should check their lungs once
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com