Karnataka : మటన్ బిర్యానీ కాదది.. కుక్క బిర్యానీ.. వేల కిలోల కుక్కల మాంసం పట్టివేత.. దారుణ నిజాలు

కొన్ని నెలలుగా హోటల్‌ భోజనం అంటేనే ప్రజలు జంకుతున్నారు. నిల్వ చేసిన మాంసానికి కోటింగ్‌ వేసి వడ్డిస్తున్నారు. నాసిరకం సరుకులతో మసాలాలు దట్టింటి వంటలు చేసి వడ్డిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో చిన్న హోటళ్ల నుంచి స్టార్‌ హోటళ్ల వరకు పాడైన ఆహారపదార్థా, కుళ్లిన మాంసం పట్టుబడ్డాయి. కొన్ని హోటళ్లను అధికారులు సీజ్‌ చేశారు.

Written By: Raj Shekar, Updated On : July 30, 2024 8:18 pm
Follow us on

Karnataka :  ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది హోటల్‌, రెటస్టారెంట్‌ భోజనం, ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. ఇక పట్టణాలు, నగరాల్లో అయితే వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. ఇంట్లో పొయ్యి వెలిగించరు. సినిమాలు, షికార్లకు వెళ్లి రాత్రివరకు ఎంజాయ్‌ చేసి వచ్చేటప్పుడు హోటళ్లలో తినేసి ఇంటికి రావడం పరిపాటైంది. ఇక నాన్‌వెజ్‌ ప్రియులు అయితే వెరైటీలు ఆర్డర్‌ చేసి మరి తెప్పించుకుంటారు. బంధువులు వచ్చినా.. ఇళ్లలో చిన్న చిన్న పార్టీలు అయినా..వంట చేయకుండా.. ఆర్డర్‌పై హోటళ్ల నుంచే తెప్పించుకుంటున్నారు. తాజాగా బెంగళూర్‌లో వెలుగు చూసిన ఘటన నాన్‌వెజ్‌ ప్రియులను షాక్‌కు గురిచేసింది. ఇప్పటికే హోటళ్లలో కుళ్లిన భోజనం పెడుతున్నారని, నాసిరకం మసాలాలు వాడుతున్నారని అధికారులు ఇటీవలే గుర్తించారు. దీంతో హోటల్‌ భోజనం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో బిర్యానీ తిన్న కుటుంబం ఆస‍్పత్రిపాలైన ఘటన కూడా జరిగింది. ఈ క్రమంలో నాన్‌వెజ్‌ ప్రియులకు షాక్‌ ఇచ్చే ఘటన ఇప్పుడు మరింత భయపెడుతోంది. మటన్ అని చెప్పి.. కుక్క మాంసాన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్న ఓ ముఠాను కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 4,500 కిలోల కుక్క మాంసం స్వాధీనం చేసుకున్నారు.

ఆరోగ్యంతో చెలగాటం..
దేశంలో నష్టం లేని వ్యాపారాలుగా మార్కెట్‌ నిపుణులు గుర్తించిన మూడు రంగాలు విద్య, వైద్యం, ఆహారం. ఈ వ్యాపారాలకు నష్టం ఉండదని, వేగంగా విస్తరిస్తాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. అందుకు తగ్గట్లుగానే ఆహార వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. వెరైటీ ఆహారాలతో పెద్ద పెద్ద హోటళ్ల నుంచి స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌ వరకు అన్నీ మంచి లాభాలతోనే నడుస్తున్నాయి. అయినప్పటికీ కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం నాసిరకం పదార్థాలతో వంటలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకు బెంగళూరులో పట్టుబడిన కుక్క మాంసమే నిదర్శనం. తాజాగా రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన భారీగా కుక్క మాంసం.. పట్టుకోవడం మాంసం ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 90 బాక్సులలో 4,500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది.

ఆందోళనలో బెంగళూరు వాసులు..
బెంగళూర్‌లోని యవ్వంత్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు మాసం పేరుతో రాజస్థాన్ నుంచి కుక్క మాంసం సరఫరా చేసిన వార్త బయటకు తెలియడంతో బెంగళూరు వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లూ తాము తిన‍్నది కుక్క మాంసమేనా హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్‌ బిర్యానీ తిన్న నన్‌వెజ్‌ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో భారీగా కుక్క మాంసాన్ని పట్టుకున్నారు. 90 డబ్బాల్లో తరలించిన 4,500 కిలోల కుక్క మాంసాన్ని హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. అయితే నిత్యం బెంగళూరు నగరానికి 14 వేల కిలోల కుక్క మాంసం వస్తున్నట్లు సంబంధితవర్గాలు ఆరోపించాయి.