https://oktelugu.com/

Film Industry :  మన స్టార్ హీరో హీరోయిన్ల బాడీ పార్ట్స్ కి ఇన్స్యూరెన్స్ ఉంటుందనే విషయం మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉండే నటీ నటులను డైరెక్ట్ గా చూడటానికి, వాళ్ళతో ఫోటోలు దిగడానికి వాళ్ల అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 08:15 PM IST
    Follow us on

    Film Industry :  సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఒక సినిమా బాగా రావడానికి కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది. దానివల్లే ఆయా ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు హీరో హీరోయిన్లను ఓన్ చేసుకొని ఆ మూవీని చూస్తారు…ఇక చాలా మంది దర్శక నిర్మాతలు హీరో పక్కన ఈ సినిమాలో ఏ హీరోయిన్ అయితే బాగుంటుందని చాలా రకాలుగా ఆలోచించి ఆ హీరోకి సెట్ అయ్యే హీరోయిన్ ను తీసుకుంటారు. ఇక దానివల్ల సినిమాలో ఉన్న స్టొరీ మీద ప్రేక్షకుడికి ఒక మంచి ఇంప్రెషన్ కలగాలంటే ముందు హీరో హీరోయిన్లు తను యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఇక అందుకే మన నటినటులు చాలా వరకు అందంగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తూనే నటనపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఏ హీరో పక్కన ఎలా నటించాలి అనే మెలకువలను కూడా నేర్చుకుంటూ ఉంటారు… ఇక ఇదిలా ఉంటే కొంతమంది అభిమానులు హీరో హీరోయిన్లను దేవుళ్ళుగా భావించి పూజిస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన నటీనటులకు ఏదైనా జరిగితే వాళ్ళు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే సినిమాల్లో నటించే నటీనటులు రిస్కీ షాట్స్ లో తమ డూపులను వాడుతూ షూటింగ్ చేస్తారు. ఇక ఇదిలా ఉంటే ఇలాంటి ఇంజూరీస్ జరుగుతాయనే కొంతమంది హీరో హీరోయిన్లు వాళ్ల బాడీ పార్ట్స్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటారనే విషయం మనలో చాలామందికి తెలియదు…

    ఇది విన్న కొంతమంది బైకులు, కార్లకు ఇన్సూరెన్స్ చేసుకోవడం విన్నాం, కానీ ఒక మనిషి బాడీ పార్ట్స్ కి కూడా ఇన్సూరెన్స్ చేయడం ఏంటి అనే డౌట్లు వస్తుంటాయి. కానీ నిజానికి మీరు విన్నది వాస్తవమే… స్టార్ హీరోల బాడీ పార్ట్స్ కి ఏమైనా జరిగితే సగటు ఇన్సూరెన్స్ కంపెనీ వారు కొంత అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది…ఇక దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం…

    ఇక ఇందులో మొదటగా కొంతమంది హీరో హీరోయిన్లు వాళ్ల బాడీ పార్ట్స్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఆయా కంపెనీలతో టైయాప్ అయి ఆ కంపెనీకి ఇయర్లీ కొంత అమౌంట్ ని ఈఏంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. దాని ద్వారా వీళ్ళ బాడీ పార్ట్స్ కి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లు చేసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని బట్టి కొంత అమౌంట్ ను చెల్లిస్తారు…ఇక ఈ ఇన్సూరెన్స్ చేసుకున్న నటినటులు ఎవరంటే…

    ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా గురించి చెప్పాలి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ఇక తన ఎంటైర్ కెరియర్ లో బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించడమే కాకుండా నెంబర్ వన్ హీరోయిన్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆమె తన లిప్స్ కి ఇన్సూరెన్స్ చేసుకుంది. ఒకవేళ తన పెదాలకి ఏదైనా ప్రమాదం జరిగితే సగటు ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఆమెకు 10 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది…

    బాలీవుడ్ స్టార్ హీరో అయిన జాన్ అబ్రహం కండల వీరుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ఈయన ధూమ్ సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తన బాడీలో చెస్ట్ భాగానికి ఇన్స్యూరెన్స్ చేసుకున్నాడు. ఒకవేళ తన చెస్ట్ కి ఏదైనా ఇబ్బంది జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వారు దాదాపు 8 కోట్ల వరకు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది…