https://oktelugu.com/

Madhya Pradesh : అశ్లీల వీడియోతో అల్లకల్లోలమైన కుటుంబం.. మధ్యప్రదేశ్ లో దారుణం

అరచేతిలో ఇమిడి పోతున్న సెల్ ఫోన్ వల్ల ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చెడు కార్యక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని కుటుంబంలో చిచ్చు పెట్టింది.. అది అంతిమంగా పెను విషాదానికి కారణమైంది. మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఏప్రిల్ 24 న ఓ చిన్నారి (9) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 28, 2024 / 04:24 PM IST
    Follow us on

    Madhya Pradesh : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సెల్ ఫోన్ లో రోజురోజుకు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎంత మంచి నైతే చేస్తున్నాయో.. అదే స్థాయిలో చెడుకు కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్లు చిన్న పిల్లలకు ఇస్తుండడం వల్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి దారుణమే మధ్యప్రదేశ్ లోని ఒక కుటుంబంలో జరిగింది. అది అంతులేని విషాదానికి కారణమైంది. మీడియాలో, సోషల్ మీడియాలో సంఘటనకు సంబంధించిన విషయాలు ప్రచారం కావడం చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో పెద్దలు పిల్లలకు సెల్ ఫోన్ లు ఇవ్వడం ఎంతటి ప్రమాదకరమో రుజువు చేసింది..

    అరచేతిలో ఇమిడి పోతున్న సెల్ ఫోన్ వల్ల ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చెడు కార్యక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని కుటుంబంలో చిచ్చు పెట్టింది.. అది అంతిమంగా పెను విషాదానికి కారణమైంది. మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఏప్రిల్ 24 న ఓ చిన్నారి (9) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఈ కేసులో మృతురాలి తల్లి, ఇద్దరు అక్కలను, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు సంబంధించిన వివరాలను ఆ జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ వెల్లడించారు..” సరిగ్గా మూడు నెలల క్రితం రీవా జిల్లాలోని జవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఆ ఇంటి ఆవరణలో పడుకుని ఉన్న ఆ బాలికను ఏదో విష సర్పం కరిచినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు శివపరీక్ష చేసినప్పుడు ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు.. ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్టు తేలింది. అదే నివేదికను పోలీసులకు చాలా పరీక్ష చేసిన వైద్యులు ఇచ్చారు. దీంతో మాకు అనుమానం కలిగింది. దీంతో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. పలు విధాలుగా మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు సేకరించాం. అయితే వారు మేము అడిగిన ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు. దీంతో పలుమార్లు వారిని మేము విచారించాల్సి వచ్చింది. దీంతో అసలు విషయం బయటపడిందని” ఎస్పీ వివేక్ సింగ్ వివరించారు.

    దారుణం చోటుచేసుకుంది

    ఏప్రిల్ 24న ఆ బాలిక (9), ఆమె సోదరుడు (13) తమ ఇంటి ఆవరణలో నిద్రపోయారు. అయితే ఆ బాలుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అదేపనిగా అతడు ఆరోజు రాత్రి అశ్లీల వీడియోలు చూశాడు. ఆ వీడియోల ప్రభావం వల్ల అతడు ఉద్రేకానికి గురయ్యాడు. అంతే తన పక్కనే నిద్రిస్తున్న చిన్నారిపై అత్యాచారం చేశాడు. తన సోదరుడు తన పై పడి చేయరాని పని చేస్తుండడంతో ఆ బాలిక ఏడుపు మొదలు పెట్టింది..” నువ్వు ఇలాంటి పని చేస్తావా? సోదరుడివై ఉండి వావి వరస మరచిపోతావా. నేను నాన్నకు చెప్తానంటూ” ఆ బాలిక ఏడుస్తూ అనడంతో.. ఆ బాలుడు ఆమె గొంతు నులిమాడు. చనిపోయిందని భావించి.. అసలు విషయాన్ని తన తల్లికి చెప్పాడు. అప్పటికి ఆ బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. ఆ బాలుడు ఆమె గొంతును గట్టిగా నులమడంతో చనిపోయింది. అయితే ఆ అలికిడికి ఆ బాలుడి అక్కలు కూడా నిద్ర లేచి ఇంటి ఆవరణలోకి వచ్చారు. ఆ తర్వాత వారికి విషయం అర్థమైంది. దీంతో వారు భయంతో ఆధారాలు మొత్తం చెరిపివేశారు. అయితే పోలీసులకు విష సర్పం కరిచిందని అబద్ధం చెప్పారు. అయితే పోలీసులు సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత.. మృతురాలి ఇంటి పక్కన ఉన్న 50 మందిని విచారించిన తర్వాత జరిగిన నేరాన్ని నిరూపించారు. ఆ ఇంట్లో ఉన్న నలుగురిని అరెస్టు చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.