Spain vs Argentina : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు న్యూజెర్సీ చేరుకున్నారు. అభిమానుల రాకతో న్యూజెర్సీ ప్రాంతం కోలాహలంగా మారింది. అమెరికా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అభిమానులకు విందు,వినోదాలను కూడా సిద్దం చేసింది ఫిఫా నిర్వాహక కమిటీ. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అర్జెంటీనా మెస్సీ, స్పెయిన్ యామల్ మీదనే అందరి చూపూ ఉంది.
స్పెయిన్ జట్టులో ఉన్న టాప్ ప్లేయర్లతో నలుగురితో మెస్సీకి ప్రత్యేకమైన బంధం ఉంది. అందులో యామల్ ముందువరుసలో ఉంటాడు. యామల్ చిన్నప్పుడు మెస్సీ అతడిని ముద్దు చేశాడు. యామల్ ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు మెస్సీ ఎత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2007లో ఈ కార్యక్రమం జరిగింది. నాడు యామల్ ఐదు నెలల వయసులో ఉన్నప్పుడు మెస్సీ స్నానం చేయించాడు. నాటి యామల్ ఎదిగి ఇప్పుడుఏకంగా మెస్సీతో పోటీపడుతున్నాడు.
యామల్ మాత్రమే స్పెయిన్ లో మరో ముగ్గురు ప్లేయర్లతో మెస్సీకి ప్రత్యేకమైన బంధం ఉంది. డానీ ఓల్మో, జోవాన్ గ్రేసియా, గవీవంటి ప్లేయర్లతో మెస్సీకి అనుబంధం ఉంది. డానీ బార్సిలోనా మిడ్ ఫీల్డర్ గా కొనసాగుతున్నాడు. ఇతడికి మెస్సీ అంటే ప్రత్యేక మైన అభిమానం. చిన్నప్పుడే మెస్సీతో కలిసి గవీ ఫొటోలు దిగాడు. స్పెయిన్ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్ గా, సెంట్రల్ మిడ్ ఫీల్డర్ గా డానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇతడు బార్సిలోనా లో చాలా సంవత్సరాల క్రితమే మెస్సీతో కలిసి ఫొటోలు దిగాడు.
గ్రేసియా స్పెయిన్ గోల్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. మెస్సీతో కలిసి ఇతడు చిన్నప్పుడు ఫొటోలు దిగాడు. ఇప్పుడు ఏకంగా మెస్సీ గోల్ చేయకుండా అడ్డుకోవడానికి రెడీ అయ్యాడు. చిన్నప్పుడు మెస్సీ చేతిలో సందడి చేసిన వీరు ఇప్పుడు ఏకంగా ఫుట్ బాల్ లెజెండ్ తోనే పోటీకి సిద్ధమయ్యారు. స్పెయిన్ లో ఈ నలుగురు.. అర్జెంటీనాలో మెస్సీ ఒక్కడు.. మొత్తానికి ఈ ఐదుగురి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగడం ఖాయం. అభిమానులకు వీనులవిందైన ఫుట్ బాల్ ఆనందం దక్కడం పక్కా అని ఫుట్ బాల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది అభిమానులు న్యూజెర్సీ చేరుకున్నారు. ఫుట్ బాల్ సమరాన్ని చూసేందుకు సిద్ధమైపోయారు.
