Homeక్రీడలుArgentina vs Spain : అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్; మెస్సీ అభిమానులకు చొక్కాలు చించేసే శుభవార్త

Argentina vs Spain : అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్; మెస్సీ అభిమానులకు చొక్కాలు చించేసే శుభవార్త

Argentina vs Spain : ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. స్పెయిన్, అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. స్పెయిన్ జట్టులో లమీన్ యామల్, అర్జెంటీనా జట్టులో మెస్సీ కీలక క్రీడాకారులుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుత ఫుట్ బాల్ ప్రపంచకప్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి మీదనే అందరి చూపు ఉంది. ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరూ రెచ్చిపోతే అభిమానులకే పండగే పండగ.

ఫైనల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ ఫుట్ బాల్ కు గుడ్ బై చెబుతానని మెస్సీ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ గురించి మెస్సీ కీలక ప్రకటన చేశాడు. మీరు కెరియర్ మొత్తాన్ని వీడియో గేమ్ లాగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నఫిఫా టోర్నీ మీకు చివరిదా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి మెస్సీ కాస్త విచిత్రంగా సమాధానం చెప్పాడు.

ఖతార్ లో జరిగిన 2022 ఫిఫావరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ ఆడేశాను. నాడు జట్టుకు ఫిఫా వరల్డ్ కప్ అందించాను. నా కెరియర్ లో సూపర్ స్టేజీని ఆస్వాదించాను. ఇప్పుడు నేను ఆటను ముగించాను అని మెస్సీ ఎవరికీ అర్థం కాని విషయంలో స్పందించాడు. ఈనేపథ్యంలో మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించేది లేదని చాలామందికి క్లారిటీ వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ తర్వాత మెస్సీ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మెస్సీ రిటైర్మెంట్ గురించి కోచ్ లియోనల్ స్కలోనీ కూడా విచిత్రమైన సమాధానం చెప్పాడు. మెస్సీ రిటైర్మెంట్ గురించి ఎటువంటి సమాచారం తనకు లేదని స్కలోనీ పేర్కొన్నాడు. మెస్సీ ఒకవేళ తన నిర్ణయంతో మమ్మలందరినీ షాక్ కు గురి చేసే అవకాశం ఉందని ఆయన వివరించారు. రిటైర్మెంట్ ఆంశం అతడి పరిధిలోనేదని.. అది ఆయన ఇష్టమని వివరించారు.

ప్రస్తుత ఫిఫా కప్ లో మెస్సీ ఏకంగా 8 గోల్స్ చేశాడు. ఆయన గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే కూడా 8గోల్స్ 3 అసిస్ట్ లు చేశాడు. స్పెయిన్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ పురస్కారం దక్కించుకుంటాడు. మెస్సీ కనుక గోల్ చేయకుంటే ఎంబాపే కు గోల్డెన్ బూట్ దక్కుతుంది. మెస్సీ ప్రస్తుతం తన కెరియర్ లో ఆరో ఫిఫా కప్ ఆడుతున్నాడు. ఏకంగా 21 గోల్స్ చేశాడు. అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 20 గోల్స్ తో ఎంబాపే రెండో స్థానంలో ఉన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version