bigg boss telugu 10 : మరో 45 రోజుల్లో ‘బిగ్ బాస్ 10’ మొదలు కానుంది. ఈ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత సీజన్ చాలా పెద్ద హిట్ అయ్యింది, ఈ సీజన్ కూడా అంతకు మించే ఉంటుందని వాళ్ళ నమ్మకం. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా హౌస్ లోకి సామాన్యుల క్యాటగిరీ లో అడుగుపెట్టబోతున్నారట. దాదాపుగా 7 నుండి 10 మంది సామాన్యులు హౌస్ లో రానున్నారని టాక్. ఈ నెల 25 నుండి ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన షూటింగ్ ని మొదలు పెడతారట. ఆగస్టు 15 నుండి ఈ షో స్టార్ మా , హాట్ స్టార్ యాప్స్ లో స్ట్రీమింగ్ కానుంది. గత సీజన్ లో జడ్జీలుగా వ్యవహరించిన వారీ ఈ సీజన్ లో కూడా రాబోతున్నారట.
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టీం సెలబ్రిటీల విషయం లో ఈసారి తగ్గేదేలే అనే మూమెంట్ ఉన్నారట. అత్యధిక శాతం యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిని హౌస్ లోకి తీసుకొని రావాలని చూస్తున్నారట. ఇప్పటికే సోషల్ మీడియా లో అనేక పేర్లు ప్రచారం లో ఉన్నాయి. ఆగస్టు 2వ వారం లో కంటెస్టెంట్స్ విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టీం ఒక క్రేజీ హీరోయిన్ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. స్టార్ మా ఛానల్ లో అత్యంత ప్రజాధారణ పొందిన సీరియల్స్ లో ఒకటి ‘గుప్పెడంత మనస్సు’. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన రక్షా గౌడ ని ‘బిగ్ బాస్ 10’ లో కంటెస్టెంట్ గా తీసుకోనున్నారట.
రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ఈమెని సంప్రదించారని, ఆమె కూడా ఈ షోలో పాల్గొనేందుకు సుముఖంగానే ఉందని సమాచారం. అయితే రెమ్యూనరేషన్ విషయం లో ప్రస్తుతం ఈమె టీం తో సంప్రదింపులు జరుపుతుంది అట. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తే ఈ షోలో ఆమె పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మరి బిగ్ బాస్ టీం ఆమె డిమాండ్స్ కి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. రక్షా గౌడ కి యూత్ ఆడియన్స్ ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ప్రతీ సీజన్ లోనూ ఇలాంటి క్రేజ్ ఉన్న ఒక కంటెస్టెంట్ ని తీసుకోవడం బిగ్ బాస్ టీం కి మామూలే. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ కి లేడీ టైటిల్ విన్నర్ అలవోకగా అయిపోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
