Homeక్రైమ్‌Pune businessman case: పూణే వ్యాపారి కేసు.. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ లు.. ఇంకా ఎన్ని...

Pune businessman case: పూణే వ్యాపారి కేసు.. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ లు.. ఇంకా ఎన్ని మలుపులు ఉన్నాయో..

Pune businessman case: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు కు సంబంధించి రకరకాల మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మతిరిగి పోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో సియాగోయల్ తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను చంపడానికి ప్రధాన కారణం ప్రియుడు చేతన్ చౌదరి అని తెలుస్తోంది. అతడు ఆమెను అనేకసార్లు బ్లాక్మెయిల్ చేశాడని.. అందువల్లే అతడిని హత్య చేయడానికి […]

Pune businessman case: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు కు సంబంధించి రకరకాల మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మతిరిగి పోయే నిజాలు తెలుస్తున్నాయి.

ఈ కేసులో సియాగోయల్ తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను చంపడానికి ప్రధాన కారణం ప్రియుడు చేతన్ చౌదరి అని తెలుస్తోంది. అతడు ఆమెను అనేకసార్లు బ్లాక్మెయిల్ చేశాడని.. అందువల్లే అతడిని హత్య చేయడానికి ఆమె సిద్ధమైందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో చేతన్ చౌదరి ఈ విషయాన్ని అంగీకరించినట్టు సమాచారం. మొదట్లో అతడిని చంపడానికి మే నెలలో ప్రణాళిక రూపొందించింది సియా. ఆది విఫలమైంది. ఆ తర్వాత జూన్ 14న కూడా అతనిని చంపడానికి కోట వద్దకు తీసుకెళ్లింది. ఆ ప్లాన్ కూడా ఫ్లాఫ్ అయింది. జూన్ 18న మాత్రం చేతన్.. సియా ఇద్దరు కలిసి కేతన్ ను చంపినట్టు సమాచారం.

సియాను అనేక పర్యాయాలు బెదిరించడం.. ప్రవేట్ వీడియోలు.. ప్రైవేట్ సంభాషణలు బయట పెడతానని చేతన్ చౌదరి బెదిరించడంతో సియా ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు సంపాదించినట్టు సమాచారం.

మరోవైపు ఈ కేసు సంబంధించి ఒక కీలక వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికి ముందు సియా, కేతన్ ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. ఇందులో సియా సిగ్గుల మొగ్గ గా నటించింది. అంతేకాదు అతనిపై ప్రేమను చూపించింది. ఇది నిజమే అని అతడు నమ్మాడు. చివర్లో వెల్కమ్ టు అగర్వాల్ ఫ్యామిలీ అంటూ ఆమె ఆ వీడియో షూట్లో చెప్పడం విశేషం. వెల్కమ్ చెప్పి చివరికి అతనికి గుడ్ బై పలికిందని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఈ సియాను తమ ఇంటి కోడలు చేసుకోవాలని కేతన్ అగర్వాల్ తండ్రి భావించాడు. ఫలితంగా సియా కుటుంబాన్ని అనేక పర్యాయాలు సంప్రదించాడు. చివరికి వారు ఒప్పుకున్నారు. అయితే పెళ్లికి ముందు సియాను కూడా అనేకసార్లు అడిగారు. దానికి ఆమెకు సమ్మతమే అని చెప్పడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. తమ కూతురు ఇలా చేసిందంటే నమ్మడం లేదని సియా తల్లిదండ్రులు అంటున్నారు..

కేతన్ అగర్వాల్ కేసును విచారించడానికి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ముందుకు వచ్చారు. ఈయనను ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈయన 26/11 ముంబై ఉగ్రదాడుల కేసును వాదించారు. అత్యంత కిరాతకమైన ఉగ్రవాది కసబ్ కు ఉరిశిక్ష వేయించారు. 1993 ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసు.. ఇంకా అనేకమైన సంచలన కేసులను ప్రభుత్వం తరఫున వాదించారు. 2016లో ఈయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం అందజేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper