Homeక్రైమ్‌Madanapalle Incident: మదనపల్లి ఘటన ఒక్కటేనా.. మన సమాజం, పోలీసులు, కోర్టులు ఇంకెప్పుడు మారతాయి?

Madanapalle Incident: మదనపల్లి ఘటన ఒక్కటేనా.. మన సమాజం, పోలీసులు, కోర్టులు ఇంకెప్పుడు మారతాయి?

Madanapalle Incident: ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలోని నీరుగట్టివారపల్లి అనే గ్రామంలో ఇటీవల ఓ ఏడు సంవత్సరాల బాలిక దారుణమైన స్థితిలో చనిపోయింది. దానికి 30 సంవత్సరాల కులవర్దన్ అనే యువకుడు కారణం. ఆఘటన తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో అతడు చెరవులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు చనిపోయిన తర్వాత ఈ కేసు మాఫీ అయినట్టేనా? మన సమాజం అంత బాగున్నట్టేనా? నీరుగట్టి వారిపల్లి ఘటన తర్వాత మన సమాజం నేర్చుకోవాల్సింది […]

Madanapalle Incident: ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలోని నీరుగట్టివారపల్లి అనే గ్రామంలో ఇటీవల ఓ ఏడు సంవత్సరాల బాలిక దారుణమైన స్థితిలో చనిపోయింది. దానికి 30 సంవత్సరాల కులవర్దన్ అనే యువకుడు కారణం. ఆఘటన తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో అతడు చెరవులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు చనిపోయిన తర్వాత ఈ కేసు మాఫీ అయినట్టేనా? మన సమాజం అంత బాగున్నట్టేనా?

నీరుగట్టి వారిపల్లి ఘటన తర్వాత మన సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన పోలీసులు, పౌర సమాజం, కోర్టులు మారాలి. ఓ బాలిక తప్పిపోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే.. అన్ని ఆధారాలను సక్రమంగా సేకరించి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదేమో. ఇక మన న్యాయస్థానాలు అత్యాచారాలు, ఘోరాల విషయం ఇచ్చే తీర్పులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటివే నిందితులకు అనుకూలంగా మారుతూ ఉంటాయి.

నీరుగట్టి వారిపల్లి ఘటనలో చనిపోయిన బాలిక తండ్రి ఆగ్రహంగా మాాట్లాడాడు. ఆయన మాట్లాడినమాటలు మన సమాజంలో పేరుకుపోయిన కుళ్లు విధానాలను ఎండగడుతున్నాయి. మన సమాజం చేవ చచ్చిపోయింది. వ్యవస్థ నిద్రాణంగా మారింది. పౌర సమాజం చేష్టలుడిగి చూస్తోంది. అందువల్లే నీరుగట్టి వారి పల్లి వంటి ఘటనలు జరుగుతున్నాయి.

మనదేశంలో ప్రతిరోజూ ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చిన్నారులపై రాయడానికి వీల్లేని భాషలో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ క్షమించరాని నేరాలు.. మన్నించలేని క్రూరత్వాలు.. ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరగడం..వాటిని మీడియాలో చూసి.. అయ్యో పాపం అని అనడం.. ఆ తర్వాత షరామాములుగా వదిలేయడం పరిపాటిగా మారింది.

దుబాయ్ లాంటి ఏరియాలలో ఈ తరహా సంఘటనలు జరిగితే ఏ మగతనం చూసుకుని అయితే వీరవిగుతున్నారో దానినే లేకుండా చేస్తారు. చైనా లాంటి దేశంలో కూడా అలాంటి శిక్షలే విధిస్తారు. మన దేశంలో మాత్రం జైళ్లలో కూర్చుండపెట్టి మేపుతుంటారు. ఎప్పుడైతే నేరం వెలుగులోకి వస్తుందో.. అప్పుడే శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ను మరింత పెంచాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper