Sakkubai death is a lesson: సాధారణంగా అమ్మాయి ప్రేమ కోసం ఉసురు తీసుకునే అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అమ్మాయిలు ప్రేమను కాలదన్ని తల్లిదండ్రులు, లేదా మంచి డబ్బున్న యువకులను పెళ్లి చేసుకొని ప్రియుళ్లకు హ్యాండ్ ఇస్తుంటారు. ప్రియులు లైలా దూరమైన మజ్నులా తాగుతూ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం సమాజంలో చూస్తుంటాం. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్అయ్యింది. అబ్బాయి ప్రేమకోసం ఒక యువతి ప్రాణాలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
మెదక్ జిల్లా శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన సక్కుబాయి (21) ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమైన విషయం. ఒక పువ్వులాంటి జీవితం మధ్యలోనే చిగురించక ముందే వాడిపోవడం సమాజానికి గాఢమైన ఆవేదన కలిగిస్తుంది.
ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ వైఫల్యం జీవితాంతం అన్నీ కోల్పోయినట్లే అనుకోవడం చాలా తప్పు. మనసు దెబ్బతినే సందర్భాల్లో మనలో ధైర్యం లేకపోవడం, కుటుంబం–స్నేహితులతో పంచుకోలేకపోవడం యువతను తీవ్రమైన నిర్ణయాల దిశగా నడిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజం మొత్తానికి ఒక హెచ్చరిక.
Also Read: ప్రియుడి వద్దకు భార్య జంప్.. అదృష్టం అంటే ఈ భర్త దే!
ప్రేమ విఫలమైందని జీవితమంతా ముగిసిపోలేదు. కొత్త అవకాశాలు, కొత్త దారులు ఎప్పుడూ ఉంటాయి. కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులు యువతను మానసికంగా బలపరచాల్సిన అవసరం ఉంది. అలాగే మీడియా, విద్యా సంస్థలు కూడా యువతలో జీవన విలువలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి.
ఒక సక్కుబాయి ఈ రోజు తన జీవితాన్ని కోల్పోతే, రేపు మరెంతమంది ఇదే దారిలో వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రేమలో విజయమే కాదు, వైఫల్యాన్ని కూడా జీవితంలో భాగంగానే స్వీకరించేలా సమాజం యువతకు నేర్పించాలి.
ప్రేమలో ఓటమి అంతిమం కాదు.. కొత్త ఆరంభానికి ఆరంభం మాత్రమే.