Karnataka Horrific Incident: కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం అలవాటు మానిపించాలనే ఉద్దేశంతో ఇచ్చిన పసరు మందు ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, అందులో ఓ మహిళ కూడా మరణించారు.
Also Read: మూడు వారాల్లో రిటైర్మెంట్.. ఆ అధికారి కక్కుర్తి ఎంత అంటే?
వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ఫకీరప్ప అనే వ్యక్తి మద్యం మానడానికి ఒక ప్రత్యేక పసరు మందు ఉందని చెప్పి, ఆకురసంలో కలిపి నలుగురికి ఇచ్చాడు. వారు ఆ ఆకురసం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరి ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పరిస్థితి విషమించి, ఆసుపత్రికి తరలించేలోపే నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మానాలన్న ఉద్దేశం చివరకు వారి జీవితాలనే కబళించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు కారణమైన పసరు మందు సరఫరాదారు ఫకీరప్పను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో పసరు మందులో విషపదార్థాలు కలిసే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక తెలిసే అవకాశం ఉంది.
ఈ ఘటన మద్యం మాన్పే నామమాత్రపు మందులపై అజాగ్రత్తగా నమ్మకం ఉంచడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది.