Kaleswaram SI: అమ్మాయిలపైనే కాళేశ్వరం SI కన్ను.. అతడి చీకటి వ్యవహారాలెన్నో!*

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఎస్సై భవానీ సేన్‌ తాను మంత్రి మనిషిని అని చెప్పుకునేవారు. పై అధికారుల నుంచి కింది సిబ్బంది వరకు భయభ్రాంతులకు గురిచేసేవాడు.

Written By: Raj Shekar, Updated On : June 20, 2024 12:58 pm

Kaleswaram SI

Follow us on

Kaleswaram SI: పోలీసులు అంటే ఒక నమ్మకం.. ప్రజల మాన, ప్రాణాలు కాపాడతారన్న భరోసా.. కానీ ఓ ఇన్‌స్పెక్టర్‌ చూస్తే ఆ స్టేషన్‌లోని వారే అసహ్యించుకునే పరిస్థితి. ఎందుకంటే సదరు పోలీస్‌ కీచకుడు.. ఆయన ఎక్కడ పనిచేసినా.. అక్కడ అమ్మాయిలు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అనుభవించేదాకా వదలడు. అందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. తన సర్వీస్‌ రివాల్వర్‌తో బెదిరించి మరీ తన కామవాంఛ తీర్చుకునేవాడు. తాజాగా సొంత స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. చివరకు ధైర్యం చేసి పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు ఇన్‌స్పెక్టర్‌ పాపం పండింది. ఉద్యోగం ఊడింది.

నేను మంత్రి మనిషిని..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఎస్సై భవానీ సేన్‌ తాను మంత్రి మనిషిని అని చెప్పుకునేవారు. పై అధికారుల నుంచి కింది సిబ్బంది వరకు భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఎస్సై బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్‌లో పనిచే స్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్‌ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ బదిలీ చేసుకుని వెళ్లిపోయారు. ఇక స్టేషన్‌కు చోటామోటా నాయకులు వస్తే బాలు… అందరికి వినిపించేలా ’బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్‌ చేసిండు అని చెప్పుకునేవాడు. ఆ జిల్లాకు చెందిన మంత్రి పేరుతో పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తూ రాసలీలలు నెరిపేవాడు.

స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌పై..
ఇక తన స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల తనకు సాయం చేయమని వేడుకోగా, సదరు కీచకుడు ఆమెపై కన్నేశాడు. మానవత్వం మరిచి తుపాకీతో బెదిరించి లైంగికదాడి చేశాడు. తర్వాత ఈ విషయం బయట తెలిస్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మళ్లీ ఆమె ఇంటికి వచ్చిన సదరు ఇన్‌స్పెక్టర్‌ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
దీంతో మహిళా కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ కిరణ్‌ ఖారే విచారణకు ఆదేశించారు. ఎస్డీపీవో సంపత్‌రావు విచారణ జరిపారు. ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ చేశారు. బుధవారం(జూన్‌ 19)న కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించడంతో కరీంనగర్‌ జైలుకు తరలించారు.

సర్వీస్‌ నుంచి తొలగింపు..
ఎస్సై భవానీ సేన్‌ను సర్వీస్‌ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్లీజోన్‌–1 ఐజీ రంగనాథ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 జూలైలో ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్న సమయంలోనూ భవానీసేన్‌ ఓ మహిళపై లైంగికవేధింపులకు ప్పాడ్డాడు. అక్కడ కూడా కేసు నమోదైంది. వీటన్నింటి నేపథ్యంలో ఆర్టికల్‌ 311 ప్రకారం భవానీసేన్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఐపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.