https://oktelugu.com/

Bank Loan: బ్యాంకు లోన్ మొత్తం తీర్చేశారా? ఈ పొరపాట్లు చేస్తే నష్టపోతారు..

Bank Loan: ప్రస్తుత రోజుల్లో ఇంటి నిర్మాణం కోసం హోమ్ లోన్ తప్పనిసరిగా తీసుకుంటున్నారు. కాల పరిమితి వరకు లేదా వివిధ మార్గాల నుంచి డబ్బు రావడం ద్వారా లోన్ ను పూర్తి చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 20, 2024 12:59 pm
    Bank Loan

    Bank Loan

    Follow us on

    Bank Loan: ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బును బ్యాంకు ద్వారా లోన్ తీసుకుంటారు. అయితే ఏన్నో ఏళ్ల పాటు శ్రమకోర్చి ఈ లోన్ ను పూర్తి చేస్తారు. కానీ ఆ తరువాత కొన్ని పొరపాట్లు చేస్తారు. ఈ పొరపాట్ల వలన లోన్ పూర్తయినా లోన్ అకౌంట్ రన్ అవుతూనే ఉంటుంది. దీంతో ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే ఇక్కడ బ్యాంకు కూడా నిర్లక్ష్యం చేస్తే రోజుకు రూ.5000 చెల్లించాల్సి వస్తుంది. అదెలాగో చూద్దాం..

    ప్రస్తుత రోజుల్లో ఇంటి నిర్మాణం కోసం హోమ్ లోన్ తప్పనిసరిగా తీసుకుంటున్నారు. కాల పరిమితి వరకు లేదా వివిధ మార్గాల నుంచి డబ్బు రావడం ద్వారా లోన్ ను పూర్తి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ రుణం మొత్తం తీర్చిన సంతోషంలో కొంత మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. లోన్ పూర్తయిన తరువాత లోన్ కింద తనఖా పెట్టుకున్న వస్తువులను గానీ లేదా అందుకు సంబంధించిన పత్రాలను గానీ తీసుకోవడం లేదు. అంతేకాకుండా లోన్ పూర్తయిన తరువాత లోన్ అకౌంట్ ను క్లోజ్ చేయాలి. లేకుంటే ఇది రన్ అవుతుంది.

    Also Read: Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

    బ్యాంకు లోన్ పూర్తయిన తరువాత ముందుగా NOC సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్యాంకు వారు ఇస్తారు. లోన్ తీసుకున్న వ్యక్తికి సంబంధించి డిటేయిల్స్ ఇందులో పొందు పరుస్తూ ఎలాంటి రిమార్క్ లేదని ఇస్తారు. ఇది తీసుకోవడం వల్ల భవిష్యత్ లో మరో లోన్ తీసుకోవడానికి సులభం అవుతుంది. ఆ తరువాత లోన్ కింద తనఖా పెట్టుకున్న ఇంటి డాక్యమెంట్స్ లేదా ట్రెజరీ బిల్లులకు సంబంధించిన డాక్యమెంట్లు బ్యాంకు వారు ముందే తీసుకుంటారు. వీటిని లోన్ పూర్తయిన తరువాత తీసుకోవాలి.

    Also Read: Government Investments : ఈ యాప్ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు పెడితే డబ్బు సేఫ్.. మంచి రిటర్న్స్..

    అయితే బ్యాంకు వారు ఈ పత్రాలను తీసుకెళ్లమని మీకు మెసేజ్ చేస్తారు. ఇలా 30 రోజుల లోపు తీసుకెళ్లాలని చెప్తారు. ఒకవేళ బ్యాంకు వారు మీకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అనుకుంటే… 30 రోజుల తరువాత రోజుకు రూ.5000 ఫెనాల్టీ మీకు ఇస్తారు. అయితే బ్యాంకు వారు సమాచారం ఇచ్చినా తీసుకెళ్లపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా లోన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ వెంటనే తీసుకోవడం మంచిది.