Jhansi Viral Video: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఒకప్పటి మాదిరిగా మగవాళ్ళు, ఆడవాళ్లు కట్టుబాట్లను గౌరవించడం లేదు. విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఇష్టానుసారమైన బంధాలను కొనసాగిస్తూ బరితెగిస్తున్నారు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ.. ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా వ్యవహరిస్తున్నారు .. పైగా తాము చేస్తున్న అనైతిక బంధాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ఇటీవల ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. తన భార్య వేరే వ్యక్తితో హోటల్ గదిలో ఉందని.. మీరు వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని చెప్పాడు. దీంతో పోలీసులు వేగంగా ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఆ వ్యక్తి.. తన భార్య, ఆమె ప్రియుడు ఉన్న 113 రూమ్ నెంబర్ తలుపులు పగలగొట్టాడు. లోపల వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. తన భర్తను చూడగానే ఆ మహిళ ఒకసారిగా షాక్ కు గురైంది. ఆమె ప్రియుడు మంచం కిందికి వెళ్లిపోయాడు. దీంతో ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేశాడు. దీంతో రోడ్డు మీద ఉన్న వారంతా అక్కడికి చేరుకున్నారు. హోటల్ సిబ్బంది కూడా గుమి గూడారు. మంచం కింద దాక్కుని ఉన్న ఆమె ప్రియుడిని బయటకు లాగారు. ఆ భర్త తిట్ల దండకం అందుకున్నాడు. అయితే ఆ భార్యా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది.
” నాకు నీతో వివాహం జరిగింది. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు. నాకు నా ప్రియుడే సర్వస్వం. అతడితోనే కలిసి ఉంటాను. రెండు సంవత్సరాలుగా నీతో దూరంగా ఉంటున్నాను. అతడు నా జీవితంలో ఒక భాగం. నాకు ఇష్టమైన వ్యక్తితో జీవించాలని నిర్ణయించుకున్నాను. నీ నుంచి నేను విడాకులు కోరుతున్నా.నీతో పెళ్లయింది..నాకు ప్రియుడే సర్వస్వం.. ఏం చేస్తావో చేసుకో పో” అని భర్తకు తెగేసి చెప్పింది.
ఆ తర్వాత ఆ భర్త తన బాధను పోలీసులు ఎదుట చెప్పుకున్నాడు. “ఆమెతో పెళ్లి జరిగిన నాటి నుంచి నరకం చూస్తూనే ఉన్నాను. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం నా భార్య తరపు వాళ్ళు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కరించుకున్నాం. కొద్దిరోజులకే మళ్ళీ ఆమె గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తికి దగ్గర అయిపోయింది. విడాకులు ఇవ్వడానికి ఏకంగా 10 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని” ఆ భర్త వాపోయాడు. అన్నట్టు ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నగరంలో నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Husband and wife were living separately for two years. Husband was giving her money. They weren’t divorced.
He caught her having sex with her lover at a hotel. He even called the police.
Have fun on the husband’s money with a lover. Is this empowering? pic.twitter.com/wismDYUO46
— ︎ ︎venom (@venom1s) January 15, 2026
