T20 World Cup 2026: భారత పురుషుల క్రికెట్ జట్టులో విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక్క స్థానం కోసం ఎంతోమంది పోటీ పడుతుంటారు. ఇంత పోటీపడి చోటు దక్కించుకుంటే.. తుది జట్టులో చోటు లభించడం అంత ఈజీ కాదు. సామర్థ్యం ఉన్నప్పటికీ.. గొప్పగా ఆడే నైపుణ్యం ఉన్నప్పటికీ ఉపయోగముండదు. ఇప్పుడు టీమ్ ఇండియాలో నలుగురు ప్లేయర్లు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మరి కొద్ది రోజుల్లో భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది. శ్రీలంక జట్టు కూడా దీనికి సహా ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలో సెలెక్టర్లు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేసి జట్టును ప్రకటించారు. 15 మందిని ఎంపిక చేసినప్పటికీ జట్టులో 11 మంది ప్లేయర్లకు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. మన జట్టులో చోటు కోసం విపరీతమైన పోటీ ఉంటుందని ముందుగానే చెప్పుకున్నాం కదా.. అయితే మేనేజ్మెంట్ ప్రకటించిన 15 మంది ప్లేయర్ల జాబితాలో 11 మందికి మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. అందులో నలుగురు ప్లేయర్లు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావాల్సి వస్తోంది…
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్ కు గాయం కావడంతో.. అతడు టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆల్రౌండర్ కేటగిరీలో అక్షర్ కు అవకాశం కల్పించారు. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి ఇప్పటికే స్థానాలు ఖాయమైపోయాయి. శ్రేయస్ అయ్యర్ కు జట్టులో చోటు లభించింది. అలాంటప్పుడు అక్షర్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కులదీప్ యాదవ్ తనను తాను నిరూపించుకుంటే అక్షర్ కు నిరాశ తప్పదు.
రింకూ సింగ్
స్లాగ్ ఓవర్లలో బీభత్సంగా బ్యాటింగ్ చేసే రింకు సింగ్ కు టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించింది. అయితే అతడు తుది జట్టులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. లోయర్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య, శివం దుబే వంటి వారు ఉన్నారు. వారిద్దరి కూడా బెస్ట్ ఫినిషర్లు. అలాంటప్పుడు రింకు సింగ్ కు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉండకపోవచ్చు.
హర్షిత్ రానా
గౌతమ్ గంభీర్ అండదండలు ఇతడికి పుష్కలంగా ఉన్నాయి. పైగా బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ వంటి బౌలర్లు ఉన్న నేపథ్యంలో.. హర్షిత్ కు చోటు లభించడం కష్టమని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇషాన్ కిషన్
ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు ఈ యువ ఆటగాడు. అయితే సంజు శాంసన్ ఎలాగూ కీపింగ్ చేస్తాడు. బ్యాటింగ్ కూడా ఆదే స్థాయిలో అదరగొడతాడు. అలాంటప్పుడు ఇషాన్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి ఉంటుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.
