Instagram Harassments: సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ప్రముఖమైనది ఇన్ స్టా గ్రామ్. ఈ యాప్ కు వివాహిత బానిస అయింది. తరచూ అందులోనే మునిగి తేలేది. చివరికి ఆమె తన జీవితాన్నే నష్టపోయింది. ఇన్ స్టా లో ఆ వివాహితకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచు వాళ్ళిద్దరూ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం.. అది హద్దులు దాటిపోవడం.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఆ యువకుడు ఆ వ్యవహారాన్ని మొత్తం రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆ యువకుడు ఆ వివాహితను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినట్లు సమాచారం. దీంతో అతడికి 4 లక్షల నగదు, బంగారం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చక్రద్వార బంధం గ్రామాల్లో చోటుచేసుకుంది.. గ్రామానికి చెందిన ఓ వివాహిత తరచూ ఇన్ స్టా ను ఉపయోగించేది. అలా ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరు తరచుగా చాటింగ్ చేసుకునేవారు. అది కాస్త శృతి మించింది. దీంతో అతడు ఆ వ్యవహారాన్ని ఆమెకు తెలియకుండా రికార్డ్ చేశాడు. చివరిగా ఆ వీడియో చూపించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె అతను చెప్పినట్టుగా నాలుగు లక్షల నగదు, బంగారం ఇచ్చింది. అయితే బంగారు నగలు ఆమె ఒంటిమీద కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఫలితంగా ఆమె తన పుట్టింటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక చిన్న పాప ఉంది.
మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో..
ఆ వివాహిత పుట్టింట్లో ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఆ వివాహితకు ఒక సోదరుడు ఉన్నాడు. తన సోదరి ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడానికి అతడు తట్టుకోలేకపోయాడు. దీంతో అతడు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వాడిన ఫోన్ ను పోలీసులకు అందించాడు. దీంతో వారు ఆ ఫోన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆ వివాహిత తరచూ ఇన్ స్టా గ్రామ్ వాడేదని గుర్తించారు. అతడు ఇన్ స్టా గ్రామ్ ఉపయోగిస్తున్న లోకేషన్ ఆధారంగా విశాఖపట్నం చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పట్టుకోడానికి ప్రత్యేకమైన బృందాలను పంపించారు. “గతంలో ఏమైనా మోసాలు చేశాడా? ఇలాగే మహిళలను బుట్టలో వేసుకొని ఇబ్బంది పెట్టాడా?” అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సామాజిక మాధ్యమాలలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అపరిచిత వ్యక్తులతో ఎటువంటి చాటింగ్, ఇతర వ్యవహారాలు నడపకూడదని సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులు సోషల్ మీడియాలో పంపిన రిక్వెస్ట్ లను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. అయితే ఆ వివాహిత చాటింగ్ చేస్తున్న సమయంలో ఏం జరిగి ఉంటుంది? అతడు ఆమెను ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు? ఇద్దరి మధ్య చాటింగ్ జరుగుతున్నప్పుడు వ్యవహారం శృతి మించిందా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవని స్థానికులు చెబుతున్నారు