Pushpa 2: ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో #RRR ని దాటేసిన ‘పుష్ప 2: ది రూల్’..కేవలం నైజాం ప్రాంత హక్కులు ఎంతో తెలుసా?

Pushpa 2: ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో #RRR ని దాటేసిన 'పుష్ప 2: ది రూల్'..కేవలం నైజాం ప్రాంత హక్కులు ఎంతో తెలుసా?

Written By: Vicky, Updated On : October 19, 2024 2:47 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: ‘కల్కి’ చిత్రం విడుదల తర్వాత కొంతకాలం వరకు స్టార్ హీరోల సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ సంక్షోభం లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిన్న సినిమాలు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పాత సూపర్ హిట్ సినిమాలే థియేటర్స్ ని రక్షించాయి. అలాంటి గడ్డు పరిస్థితి ఎదురుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ కి ఇచ్చిన ఊపు మామూలుది కాదు. సెప్టెంబర్ 27 వ తారీఖున మొదలైన ‘దేవర’ బాక్స్ ఆఫీస్ జాతర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలకు ఈ స్థాయి థియేట్రికల్ లాంగ్ రన్ రావడం చాలా అరుదు. థియేటర్స్ ని నమ్ముకొని బ్రతుకుతున్న ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం పెట్టిన పెట్టిన ప్రతీ పైసాకి పది రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ట్రేడ్ చూపు మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘పుష్ప 2’ మీదనే ఉంది.

2022 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలై పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘పుష్ప’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రారంభ దశ నుండే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుకుమార్ ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఈ సినిమాని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఐకానిక్ బ్లాక్ బస్టర్ గా నిలిపేందుకు తన శక్తిమేర పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి, రెండు లిరికల్ వీడియో సాంగ్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ కలిసి రావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి #RRR తో సమానమైన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. #RRR చిత్రానికి 220 కోట్ల రూపాయిల బిజినెస్ జరగగా, పుష్ప 2 చిత్రానికి 193 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రాంతాల వారీగా ఎంత బిజినెస్ జరిగిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో 80 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, సీడెడ్ 30 కోట్లు, ఉత్తరాంధ్ర 23 కోట్ల 40 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా 14 కోట్ల 40 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా 10 కోట్ల 80 లక్షలు, గుంటూరు జిల్లా 15 కోట్ల 30 లక్షలు, కృష్ణ జిల్లా 12 కోట్ల 60 లక్షలు, నెల్లూరు జిల్లా 7 కోట్ల 20 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాం ప్రాంతంలో #RRR చిత్రానికి సరిసమానంగా బిజినెస్ జరగగా, ఉత్తరాంధ్ర మరియు గుంటూరు జిల్లాల్లో #RRR కంటే ఎక్కువ బిజినెస్ ని జరుపుకుంది. ఇక ఓవర్సీస్ అయితే ఏకంగా 15 మిలియన్ డాలర్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న సంగతి తెలిసిందే.