Hyderabad: అప్పుడప్పుడు పరిస్థితులు బాగా లేకపోతే..జీవితం తలకిందులు కావొచ్చంటారు పెద్దలు. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఎవరు ఏదో చేసినా..అది మన చావుకొస్తుంటుంది. హైదరాబాద్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. రెహమత్ నగర్‌లో శ్రీనాథ్ అనే వ్యక్తి తన ఇంట్లో ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. దాన్ని ఉదయం,సాయంత్రం అలా బయట తిప్పినప్పటికీ..రోజంతా బెల్ట్‌తో ఇంట్లోనే కట్టేసేవారు. ఈనేపథ్యంలోనే ఈనెల 08న శ్రీనాథ్ పెంపుడు కుక్క బెల్ట్‌ను తెంచుకొని పక్కనున్న ధనుంజయ్ ఇంటికి వెళ్లింది.
దీంతో శ్రీనాథ్‌పై ధనుంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనాథ్ పెంపుడు కుక్క తన ఇంట్లోకి రావడంపై మండిపడ్డారు. శ్రీనాథ్ కూడా ధనుంజయ్ తీరును తప్పుబట్టారు. అనుకోకుండా వచ్చిన కుక్కపై ఇంత రాద్దాంతమేంటని ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే ధనుంజయ్ శ్రీనాథ్‌పై పగ పెంచుకున్నాడు. దీంతో ఈనెల 14న ధనుంజయ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి శ్రీనాథ్ ఇంటికి వచ్చారు. రావడం రావడమే కర్రలతో శ్రీనాథ్‌ను విచక్షణ రహితంగా చితకబాదారు. అయితే పరిస్థితిని గమనించిన శ్రీనాథ్ భార్య ధనుంజయ్,అతని స్నేహితులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. శ్రీనాథ్ పెంపుడు కుక్క కూడా ధనుంజయ్‌పై అరవడం మొదలెట్టింది. దీంతో మరింత రెచ్చిపోయిన ధనుంజయ్ శ్రీనాథ్ భార్య,ఆ పెంపుడు కుక్కను కూడా తీవ్రంగా చితకబాదారు.
ఇక ధనుంజయ్,అతని స్నేహితులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పెంపుడు కుక్క విషయం ఈస్థాయి గొడవకు దారి తీయడంపైనే విస్మయం వ్యక్తం అవుతోంది. అందుకే అంటారు పెద్దలు పరిస్థితులు అనుకూలించ కపోతే కట్టె పామై కరుస్తుందని..అందువల్ల వీలైనంత వరకు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం.
దారుణం.. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి
మధురానగర్ – రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్ భార్యపై, పెంపుడు… pic.twitter.com/y3gJBfSlXj
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2024